హైదారాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. మన దేశంలో కేవలం ౧౮ మాత్రమ్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కటే ఉంది. త్వరలో భోపాల్, ఇందోర్ రాష్ట్రాలలో ఈ సేవలు మొదలుపెడుతున్నారు.ఇక్కడ తల్లి పాలను సేకరించి,శుద్ది చేసి అవసరం అయిన వారికి ఉచితంగా అందజేస్తారు.
ఈ ప్రకృతి మానవాళీకి ఇచ్చిన వరం తల్లిపాలు.తల్లిపాలు పాపలకు ఆహరమై కాదు మెడిసిన్ కూడా.ఎంత కష్టపడ్డా వీటిలి ల్యాబ్ లో తయారుచేయలేం. ఉదాహరణకు మగబిడ్డ ని ప్రసవించిన తల్లికి వచ్చే పాలలో, ఆడబిడ్డని ప్రసవించిన  తల్లికి వచ్చే పాలలో ప్రొటిన్ విలువలు వేరువేరుగా ఉంటాయి. మగబిడ్డ తల్లిపాలలో ఫాట్ ఎక్కువగా ఉంటే,ఆడబిడ్డ తల్లి పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.తల్లిపాలలో ప్రొటిన్ విలువలు పెరుగుతున్నా బిడ్డకు అనుగుణంగా మారుతాయి.
ఇంత మంచి పోషక విలువలు ఉన్న కోంత మంది తల్లులకు చాల కారణల వల్ల రావు.అటువంటి వారి కోసమే మొదలుపెట్టిందే ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్.నీలోఫర్ ఆసుపత్రిలో రొజుకు౨౦ నుంచి ౨౫ ప్రసవాలు జరుగుతాయి.మతపరమైన భేధాలు లేకుందా చాలా మంది తల్లులు పాలను డిపాజిట్ చేస్తున్నారు అవసరమైన తల్లులు తీసుకెళ్తెతున్నరని  ,ఇంత మంచి స్పందన ఊహించలేదని దాక్టర్లు చేబుతున్నారు.
సేకరించిన పాలను ఇతరులకు అందించే ముందు 5-6 ప్రక్రియలలో శుభ్రం చేసి 150 ml బాటిల్స్ లో  నింపి పాస్చరైజేషన్ చేస్తారు.డాక్టర్ సలహమేరకు తల్లుల వివరాలు నమొదు చేసుకోని పాలను ఉచితంగా అందజేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: