సహజంగా వ‌ర్షాకాలంలో చల్లదనానికి మనసు పులకరిస్తుంది. దీనికితోడు పడే చినుకులకు మార్కెట్లో ఆకుకూరలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని కొనకుండా అక్కడి నుంచి కదలడంమే కష్టం అవుతుంది. అంత‌గా మ‌నం వాటికి ఆక‌ర్షితులు అవుతాము. నిజానికి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే. అలా అని వర్షాకాలంలో వాటిని తింటే సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే అవుతంది. 


బాక్టీరియా, ఫంగస్ విజృంభించే వానాకాలంలో కనిపించ‌ని కొన్ని క్రీములు ఆకులలో దాగి ఉంటాయి. మ‌రియు ఈ కాలంలో ఆకు కూర‌లు, కూరగాయలు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం అమ్మకందారులు వాటికి రసాయనాలతో కూడిన ఇంజక్షన్స్‌ ఇస్తున్నారు. దీంతో వీటిని నేరుగా తీసుకుంటే ఉదర సంబంధిత వ్యాధులు రావడం ఖాయమ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


అయితే వీటిని ఎంత శుభ్రం చేసుకుని వండినా సరే ఎక్కడో ఒక చోట ఇవి పట్టే ఉంటాయి. దీని వ‌ల్ల వీటితో తయారైన ఆహారం తీసుకున్న వారు జ‌బ్బు ప‌డ‌డం ఖాయం. అయితే మ‌రి వీటిని ఎలా న‌శింప‌చేయాలో తెలుసుకోవాల్సిందే. వ‌ర్షాకాలంలో నీటిని వేడి చేయడం వల్ల దానిలోని బాక్టీరియా, ఫంగస్, వైరస్ నశిస్తాయి. ఈ నీటిలో ఆకుకూరలు, కూరగాయలు కడగడం వల్ల వాటిపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. వర్షాకాలంలో ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. దీని వల్ల వైర‌స్‌ సమస్య తీవ్రంగా ఉంటుంది.


అందుకని తీసుకునే ఆహారం విషయంలో కొంచెం అప్రమత్తత‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే దాని ప్రభావం పూర్తిగా జీర్ణాశయం మీద పడుతుంది. అంతేకాక ఎలర్జీ, టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి రోగాలు వస్తాయి. అందుకని కూరగాయలను ఆకుకూరలను సాధ్యమైనంత వరకు ఎండలో లేదా పొడి వాతావరణంలో పెట్టాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: