స‌హ‌జంగా ఎముకలు ధృడంగా లేకపోతే వృద్ధాప్యంలో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ముప్పయి ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు బలవర్దక ఆహారాన్ని తీసుకుంటూ ఎముకల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటున్నారు వైద్యులు. అయితే చాలా మంది అవసరమైనవి తినకుండా నోటికి రుచిగా ఉండే నూడిల్స్‌, చాక్లెట్స్, పాస్ట్ ఫుడ్స్ ఇలా ఏవో కొన్ని పదార్థాలు పైపైన‌ తింటుంటారు. 


ముఖ్యంగా ఆడపిల్లలకు కాలుష్యం చాలా ఎక్కువగా లభిస్తేనే వివాహం అయిన తర్వాత, బిడ్డకు తల్లి అయిన తరువాత ప్రసవ సమయంలోనూ, ఇంటిపని, ఆఫీసుపని చక్కబెట్టుకునే శక్తిసామర్ధ్యాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో 40 శాతానికి పైగా ఆడపిల్లలు కాలుష్యం లోపంతో బాధపడుతున్నారు. తగినంత కాల్షియం ఉంటేనే ఎముకల పటిష్టత బాగుంటుంది. 


- కాల్షియం అనేది సప్లిమెంటరీగా మందుల ద్వారా రాకుండా తినే ఆహార పదార్థాల నుండి సమకూర్చుకోవాల్సిన‌ అవసరం చాలా ఉంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఎముకలను రక్షించే కాలుష్యం, జింక్‌ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.


- మధ్య వయస్సు మహిళల్లో పెలుసుగా ఉండే ఎముకలకు జింక్ చాలా అవసరం. మాంసాహారులైతే సమృద్ధిగా లభించే గొర్రె మాంసం తీసుకోవచ్చు. ఇక శాఖాహారులైతే ఆకుకూరలు, తమలపాకులో కూడా జింక్ అధికశాతం ఉంటుంది.


- శరీరానికి తగినంత కాల్షియం అందించడంలో విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. పొద్దున లేస్తూనే బిజీ జీవితంలో పడిపోయే నగరజీవి శరీరం మీద సూర్యకిరణాలు పడేలా చూసుకోవడం చాలా మంచిది.


- తోటకూరలో పుష్కలంగా విటమిన్‌-కె ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకలకు అవసరమైన కాల్షియం  సరఫరా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది.


-  కండరాల పటుత్వానికి, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు, హార్మోన్ల పనితీరుకు కాల్షియం అవసరం. 


- శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలు, పళ్లలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. 


- పాలు, పాల ఉత్పత్తులు, ఛీజ్, మజ్జిగ, పెరుగు, ఆల్మండ్స్, బీన్స్‌లు తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీని వ‌ల్ల ఎముక‌ల‌కు కావాల్సిన కాల్షియం అందుతుంది.


- శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం తప్పక అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ, ఆరోగ్యంగా ఉంచుకుంటేనే కాల్షియం కొరత ఏర్పడదు. దీని కోసం ఉదయాన్నే నడవడం, పరిగెత్తడం, వ్యాయామం చేయాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: