ఒకప్పుడు బీపీ, షుగర్ వంటి వ్యాధులు చాలా తక్కువ మందికి.. అది కూడా పెద్ద వయస్సులోని వారికే వస్తుండేది. ఆధునిక కాలంలో పని ఒత్తిడి, మారిన జీవనశైలి, జంక్ ఫుడ్‌ తదితర కారణాల వల్ల ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. ఇంటికి కనీసం ఒక్కరిద్దరైనా ఈ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. షుగర్ వ్యాధి గురించి చెప్పుకుంటే.. ఈ వ్యాధి ఒక్క‌సారి వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవడానికి జీవితాంతం మందులు వాడాల్సిందే. ఆ మందుల వ‌ల్ల‌ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేక ఇతర వ్యాధులను ఎదుర్కోకతప్పదు. 


షుగర్ పేషెంట్లకు శరీరంలో ఇన్సులిన్ అసాధారణంగా ఉత్పత్తి అవుతుంద‌న్న‌ విషయం తెలిసిందే. వీరికి షుగర్ లెవెల్స్ పడిపోవడం, బరువు తగ్గడం, ఎక్కువ సార్లు మూత్రవిసర్జన, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి మందగించడం,  కాళ్ళు తిమ్మిర్లు వంటి లక్షణాలు కనపడతాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం తగదు. అయితే ముందు జాగ్ర‌త్త‌ల‌తో డ‌యాబెటిక్ ల‌క్ష‌ణాల‌ను నియంత్రించ‌వ‌చ్చు.. అవేంటో తెలుసుకోండి.


- ప్ర‌తిరోజూ తాజా కుర‌గాయ‌లు, పండ్లు వంటి పోష‌కాహారం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. దీంతో జీవ‌న‌శైలిని ఆరోగ్యంగా చేసుకోవాలి.


- షుగ‌ర్ ల‌క్ష‌ణాలు నియంత‌ర‌ణ‌కు న‌డ‌క చాలా ఉత్తమం. తెల్ల‌వారుజామున‌, సాయంత్రం అర‌గంట‌పాటు న‌డుస్తుండాలి. ఇంకా వ్యాయామం, ధ్యానం ప్ర‌తి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంటే షుగ‌ర్ వ్యాధి నియంత్రించొచ్చు.


- నిజీనికి నీటిని ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యానికి మంచిది. రక్తంలో ఉన్న హై షుగర్ కంటెంట్‌ కంట్రోల్ చేసి ఒత్తిడిని, ఇరిటేషన్ తగ్గిస్తుంది. దీంతో డ‌యాబెటిక్ ల‌క్ష‌ణాలు ద‌రిచేర‌నివ్వ‌దు.


- మీరు తీసుకొనే ఆహారంలో దాల్చిన చెక్క పొడిను తీసుకోవడం మంచిది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.


- కాఫీని రోజూ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగడంతో పాటు ధమనుల గోడలు దృఢంగా తయారవుతున్నాయని, డయాబెటిస్ రాకుండా కాఫీ నివారిస్తుంది.


- రోజూ క్రమం తప్పని విరామాల్లో ఆహారం తీసుకోవటం మంచిది.. కడుపు నిండేవ‌ర‌కు తిన‌డం క్ర‌మంగా త‌గ్గించుకోవాలి.


- చక్కెర ఉన్న ఆహారాలు మరియు విషపూరిత పానీయాల వినియోగం వ‌ల్ల మ‌ధుమేహ వ్యాధిగ‌స్త్రుల‌కు చాలా ప్ర‌మాద‌క‌రం. అందుకే వీటిని త‌ప్ప‌కుండా దూరంగా పెట్టాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: