పరిమితంగా ఉంటే ఒంటికి ఇంటికి శ్రేయస్కరమన్నది నానుడి. అందుకే అంటారు పెద్దలు పొదుపు జీవితానికే మలుపు అని. సరిగ్గా ఆల్కహాల్ విషయంలో కూడా పరిమితిని పాటిస్తే ఆరోగ్యదాయమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక అసలు విషయానికి వస్తే.. పరిమిత మోతాదులో రెడ్‌ వైన్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పలు పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా రెడ్‌ వైన్‌లో ఉండే ఓ పదార్ధం ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలిగిస్తుందని స్పష్టం చేసింది. 



 రెడ్‌ వైన్‌ తయారీలో ఉపయోగించే ద్రాక్షలో ఓ పదార్ధం ఇటువంటి పరిస్థితులను అదిగమిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఒత్తిడి, ఆందోళన వంటి వ్యాధులకు సంబంధించి ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్, ఆందోళనలను ప్రేరేపించే ఎంజైమ్‌లను రెడ్‌ వైన్‌లో ఉండే రిస్వరట్రాల్‌ అనే పదార్ధం అడ్డుకుందని పరీక్షల్లో తేలినట్లు పరిశోధకులు చెబుతున్నారు. 
డిప్రెషన్‌, ఆందోళన వంటి వ్యాధులపై రిస్వరట్రాల్‌ ప్రభావాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలో శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షించడం ద్వారా వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు.



అంతేకాదు క్యాన్సర్‌, అర్ధరైటిస్‌, డిమెన్షియా సహా పలు వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యం రిస్వరట్రాల్‌కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైన్‌లో తక్కువ పరిమాణంలో ఉండే రిస్వరట్రాల్‌ను సప్లిమెంటరీలుగా అందిచడంపై పరిశోధనలు జరుగుతున్నాయి.వేరుశెనగ పప్పులోనూ ఉండే రిస్వరట్రాల్‌ శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుందని పలు అథ్యయనాల్లో వెల్లడైంది. హాని చేసే కొవ్వులను నియంత్రించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, బీపీని నియంత్రించడంలో ఇది మెరుగ్గా పనిచేస్తుందని అథ్యయనాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: