నేటి జీవన విధానంలో మనం తీసుకునే ఆహారంలో పెద్దగా పోషక విలువలు ఉండకగా, వాటి వలన మనకు పలు రకాల శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనలో ఎక్కువ మందికి ఆహార లోపం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్, అజీర్తి, పేగుల్లో అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే అటువంటి వాటిని తొలిదశలోనే గుర్తించి తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వాటిని నయం చేసుకోవడానికి మన ఇంట్లోని రెండు పదార్ధాలతో చిన్న చిట్కాలు పాటిస్తే చాలని కొందరు డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే, శొంఠి మరియు మిరియాలు. 

ముఖ్యంగా ఈ రెండు పదార్ధాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మరియు అజీర్ణానికి బాగా చెక్ పెట్టి, మన పొట్టలో వున్న మలినాలు, మరియు చెడు వాయువులను బయటకు నెట్టి, శరీరంలో రోగనిరోధక శాంతి పెరిగేలా చేస్తాయట. కాబట్టి రోజూ మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం చేసేటపుడు, ఒక స్పూను శొంఠి పొడి మనం తినే అన్నంలో మొదటి ముద్దలో కలుపుకుని తినాలని, లేదా అదే శొంఠి పొడిని ఒక గ్లాసు పాలల్లో కలుపుకుని తాగడం వలన కడుపు శుద్ధి అయి, చెడు వాయువులు మరియు మలినాలు బయటకు పోతాయని అంటున్నారు. ఇకపోతే మనం నిత్యం తినే కూరల్లో కారం వాడకానికి బదులుగా మిరియాల పొడిని తీసుకుంటే మన శరీరంలో ముఖ్యంగా జీర్ణ క్రియలో సమస్యలు ఉంటె తగ్గుతాయని, 

అంతేకాదు మిరియాల పొడి శరీరంలో కఫాన్ని నిరోధించి జలుబు, దగ్గు వంటి శ్వాశకోశ సమస్యలకు కూడా మంచి నిరోధకారిగా పని చేస్తుందట. మనలో కొందరు తమ ఇంట్లో శొంఠిని, మిరియాల పొడిని తరచు వాడుతుంటారని, అందుకే అటువంటి వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, సమయానికి ఆకలి వేయడం, చక్కగా అరుగుదల ఉండడం జరుగుతుందని వారు అంటున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెండు ఇంట్లోని పదార్ధాలను ఉపయోగించి గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి....!


మరింత సమాచారం తెలుసుకోండి: