తేనెటీగలు పువ్వుల నుంచి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది. తేనె సంపూర్ణ పోషక పదార్ధమని, తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తేనె వల్ల‌ మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి తేనె మన ఆహారంలో భాగం అయినది. తేనె వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచ‌డంలో చ‌క్క‌డ ఉప‌యోగ‌ప‌డుతుంది.


- దగ్గు, అలర్జీ , ఆస్తమా ఉన్నవారు ఉదయం , సాయంత్రం వేడినీటిలో రెండు చెంచాలు తేనె వేసుకొని తాగినచో వ్యాధి నివారణ అగును. తేనె కఫమును నివారిస్తుంది.


- గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వల్ల‌ గుండెజబ్బులు నివారణ అగును. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.


- మధుమేహ సమస్యతో ఇబ్బంది పడువారు కూడా తేనెని వాడవచ్చు. తేనె వాడితే షుగరు పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. రక్తమును శుద్ది చేయును కావున ముత్ర విసర్జన సక్రమముగా జరుగును.


-  గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ ఉదయం రెండు చెంచాలు తేనె మంచినీటిలో కాని , కుంకుమపువ్వుతో కాని తీసుకున్నచో మంచి ఎరుపు, తెలుపు కలిగిన ఆరోగ్యవంతమైన శిశువులు జ‌న్మిస్తారు.


- తేనెలో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చుండ్రు నివార‌ణ‌కు చ‌క్క‌డ ఉప‌యోగ‌ప‌డుతుంది.


-  ప్రతిరోజు రెండుసార్లు చిన్నపిల్లలకు తేనె తాగించినచో వారికి మలబద్దకం , అజీర్ణం , కడుపునొప్పి , అతి విరేచనములు వచ్చే అవకాశం ఉండదు.


- ప్ర‌తిరోజు ప‌డుకునే ముందు ఒక స్పూన్ తేనెలో తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. దీంతో పాటు ప్ర‌శాంత‌మైన నిద్ర పొంద‌వ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: