స‌హ‌జంగా చాలా మంది దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తారు. పుచ్చి ప‌ళ్లు, చిగుళ్ల నొప్పులు, దంతక్షయం, దంతాల మ‌ధ్య సందులు మ‌రియు ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అన్ని శరీరభాగాల్లో దంతాలకు వచ్చే సమస్యలు అంతవేగంగా పోవు. దంతాలు ఆరోగ్యంగా లేకుంటే అవి మరికొన్ని శారీరక అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. 


ఇవి దీర్ఘకాలంపాటు కొనసాగితే దవడ ఎముక దెబ్బతిని దంతాలు వదులుగా తయారవుతాయి మ‌రియు పళ్లు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందమైన దంతాల సంరక్షణ కోసం మరియు పుచ్చు బాధల నుండి విముక్తి కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది.


- లవంగాలను నోట్లో పెట్టుకొని నిదానంగా చప్పరించండి. ఇది అన్ని రకాల పళ్ల సమస్యలకు స‌హాయ‌ప‌డుతుంది.  ల‌వంగాల నూనెను వాపున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌, నొప్పిని తగ్గించుకోవచ్చు.


- రోజు ఒక ఆపిల్ తినడం దంతాలతో ఏర్పడే కావిటీ ఏర్పడే అవకాశాలను తగ్గించి వేస్తుంది. అధిక చక్కెరలు గల ఆహార పదార్థాలు నోట్లో లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేసి నోట్లో ఉండే బ్యాక్టీరియా స్థాయిలు తగ్గింస్తుంది.


- పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దంత సంబంధ సమస్యలను తొలగిస్తాయి. కొద్దిగా పసుపును నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. 


- అలోవెరా జెల్‌ని వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది. వాపు, నొప్పి తగ్గించుకోవచ్చు.


- ఇంగువ మ‌రియు నిమ్మరసంలను కలిపి పేస్ట్‌లాగా చేసిన మిశ్రమాన్ని వేడి చేసి దీన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. ఇది దంతాల నొప్పులకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 


- ఒక గ్లాసు నీళ్ల‌ల్లో కొంచెం ఉప్పు క‌లిపి నోటితో పుక్క‌లించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉప్పులో యాంటీ సెప్టిక్‌ లక్షణాలు నోటిలోని ఓరల్‌ ఇన్‌ఫెక్షన్‌ని నివారిస్తుంది.


- దంతాల నొప్పులు లేదా చిగుళ్లపై వెల్లుల్లి పేస్ట్‌ లేదా ఉల్లిపాయను కొంత సేపు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల నొప్పులనే కాదు.. దంతాలను దృఢంగా చేసేందుకు కూడా ఉపయోగపడతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: