ఎవరికైన ఫోన్ చేసినప్పుడు హలోచెప్పి ఎలావున్నరని అడగడం ఆనవాయితీ,  అలా అడిగినప్పుడు చాలమంది ఎదుటివారు బాగున్నామని సమాధానం చెబుతారు.నిజంగావారు 100% బాగున్నరా అని మనంఅడగలేం.ఎందుకంటే ఇప్పుడు మనంతినే ఆహారంనుండి త్రాగేనీరు,పీల్చే గాలివరకు కలుషితమవుతుంది.మారుతున్నజీవనశైలిలో సంపాదనకోసం  రాత్రనక, పగలనక, కష్టపడి అలసిపోయి ఆరోగ్యాన్నిఅశ్రద్ధచేస్తే తగినమూల్యం చెల్లించుకోవాలన్నసంగతిని మర్చిపోవద్దు.రోజూచక్కటి పోషకాలున్న ఆహారం తీసుకోవడంతోపాటు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మనంఎంత ఆరోగ్యంగా వున్నా ఏ సమస్యాలేకున్నా తరచుగా  ఆరోగ్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.ఎందుకంటే కొన్ని పరీక్షల ద్వారా ప్రాణాంతకవ్యాధుల ముప్పును ముందేపసిగట్టొచ్చు.ఇక తరచుగా చేయించుకోవాల్సిన ఆరోగ్యపరీక్షలేంటోచూద్దాం..




క్రమం తప్పకుండా BPని చెక్ చేయించుకుంటూ,శరీరంలో కొలెస్ట్రాల్  స్థాయిలు ఎలాఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెజబ్బులతోసహా అనేకరకాల ఆరోగ్యసమస్యలు వచ్చేఅవకాశంఉంది. ECG పరీక్ష ద్వారా గుండెలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయెమోనని గుర్తించొచ్చు.ఇక అధిక బరువువల్ల కూడా గుండె జబ్బులువచ్చి,డయాబెటిస్ బారినపడే ముప్పు ఎక్కువకాబట్టి మీ బాడీ మాస్ఇండెక్స్ ని తరుచుగా చెక్ చేసుకుంటూ, నడుంచుట్టుకొలత పెరగకుండా జాగ్రత్త వహించాలి.డయాబెటిస్ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం కూడా ముఖ్యమే. RBSటెస్ట్ తోపాటుగా,యూరిన్ టెస్టులు చేయించుకోవాలి.డయాబెటిక్ రిస్క్‌నుబట్టి ఏడాదికోసారి లేదా మూడేళ్లకోసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి.కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా,అధికబరువుతో బాధపడుతున్నాజాగ్రత్తపడాలి.బోన్ డెన్సిటీ టెస్ట్ ద్వారా ఎముకల ఆరోగ్యాన్నిగుర్తించొచ్చు.సాధారణంగా 50ఏళ్లు పైబడినవారిలో ఎముకలు పెళుసుగా  మారతాయి. కాబట్టి తరచుగాబోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. 



ఇక 15నుంచి 80ఏళ్లమధ్య వయసున్న మహిళలు బ్రెస్ట్ కేన్సర్,సెర్వికల్ కేన్సర్ బారినపడేముప్పు ఎక్కువ.40ఏళ్లు దాటిన మహిళలు పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. 45ఏళ్లు దాటిన వాళ్లు బ్రెస్ట్ స్క్రీనింగ్ మమోగ్రఫీ చేయించుకోవడం ఉత్తమం. ఈ జబ్బులు వారసత్వంగా వచ్చే అవకాశాలు ఎక్కువ.కాబట్టి 35ఏళ్లు రాగానే ఈ పరీక్షలుచేయించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనపెద్దలు. ఆరోగ్యంగాలేని వ్యక్తి వద్ద ఎంతడబ్బున్న, ఎన్నిసుఖాలు అనుభవిస్తున్నఆనందం మాత్రం ఆమడదూరంలో వుంటుంది.సో ముందుజాగ్రత్త అన్నివిధాల మేలు అని తెలుసుకోవాల్సిన అవసరం వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: