ఇంట్లో పసిపిల్లలుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలెం.అమాయకమైన వారి చూపులు,బోసినవ్వులు,అప్పుడప్పుడు పెట్టే కేరింతలు చూస్తుంటే తల్లిదండ్రుల మనసు ఎంతగా మురిసిపోతుందో చెప్పలేం..ఇక చిన్నగా వారికి ఏమైన అనారోగ్యం కలిగిందా కలత చెందుతు నిద్ర మాని చంటిపాపను కంటిపాపలా చూస్తారు..మూడుకాలాల్లో ఏకాలమైన చిన్నపిల్లలను జాగ్రత్తగా రక్షించుకోవాలి ఎందుకంటే వారికి ఏమైన ఇబ్బంది కలిగినా చెప్పడానికి మాటలు రావు ఏడ్వడం తప్పా,ముఖ్యంగా తల్లిదండ్రులు ఆందోళన చెంది హడావుడి పడకుండా వీలైనంత తొందరగా డాక్టర్ కు చూపించాలి.ఇక పిల్లలను అధికంగా ఇబ్బందులకు గురిచేసే వ్యాధుల్లో తట్టువ్యాది ఒకటి,ప్రధానంగా పిల్లలకు వైరస్‌ వల్ల వచ్చే అంటువ్యాధి ఇది.తట్టు లేదా పొంగు అనే ఈ వ్యాధినే ఆంగ్లంలో మీజిల్స్‌ అని పిలుస్తారు.దీనికి కారణం మార్‌బిల్లీ వైరస్‌.ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్‌ వైరస్‌ జాతులను గుర్తించారు.1963లో ఈ వ్యాధికి నిరోధక టీకాను కనుగొన్నారు. జెర్మన్‌ మీజిల్స్‌ అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి రుబెల్లా వైరస్‌ వల్ల వస్తుంది.పిల్లల రోగనిరోధక శక్తిపై ఆధారపడి వుండే ఈ తట్టువ్యాధిల లక్షణాలు ఎలావుంటాయో తెలుసుకుందాం..



  
కళ్లు బాగా ఎర్రబారుతాయి.దీనిని conjunctiva అంటారు-నోటి లోపలి బుగ్గలలో ఇసుక రేణువులు వంటి మచ్చలు కన్పిస్తాయి.వీటిని కాప్లిక్‌ స్పాట్స్‌ అంటారు.కాప్లిక్‌ స్పాట్స్‌ సుమారుగా 24నుండి36 గంటలు మాత్రమే ఉంటాయి.శరీరంపై దద్దుర్లు ఎక్కువై జ్వరం తగ్గుముఖం పట్టగానే ఇవి కనిపించవు-మూడు కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటుంది.పిల్లలు బాగా నలతగా,నీరసంగా ఉంటారు.తిండి తినబుద్ధి కాదు.ముక్కు,నోరు ఎర్రగా అవుతాయి.దగ్గుతుంటారు.విరేచనాలూ కావొచ్చు.పైగా తీవ్రమైన జ్వరం ఉంటుంది.వైరస్‌ సోకిన నాలుగో రోజుకు సన్నగా దద్దు ప్రారంభమవుతుంది.ముందు ముఖం మీద, తర్వాత చెవుల వెనుక,తర్వాత ఛాతీ మీద,ఆ తర్వాతి రోజు కాళ్లకు,ఇలా క్రమేపీ తలనుంచి కాళ్ల వరకూ శరీరమంతా దద్దు వ్యాపిస్తుంది..ఈ వ్యాధి కలిగించే వైరస్‌ చాలా తేలికగా,వేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది.




వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల రోగి విడిచిన గాలిలో ఉండే క్రిములు సమీపంలో ఉన్న వ్యక్తి శ్వాసనాళ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. రోగి దగ్గినప్పుడు,తుమ్మినప్పుడు ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి.ఒకసారి మరో రోగి శరీరంలోకి ప్రవేశించగానే ఈ క్రిములు శరీర ఉపరితలంపై ఉండే కణజాలానికి అంటుకుని,అక్కడ నుంచి కణాలలోకి ప్రవేశించి,రక్తం ద్వారా వివిధ శరీర వ్యవస్థలకు చేరుతాయి.జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది.ఈ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి రోగ లక్షణాలు కనిపించడానికి 4-12 రోజుల సమయం పడుతుంది.తట్టు వచ్చినవారు వేరే వారికి ఈ రోగాన్ని రోగలక్షణాలు కనిపించిన మూడు రోజుల నుంచి మొదలుకొని,దద్దుర్లు పూర్తిగా తగ్గిన ఐదు రోజుల వరకూ అంటించే ప్రమాదముంది..తట్టు వ్యాధి పిల్లలకు చాలా ప్రమాదకరమైంది కాబట్టే జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా టీకాల ద్వారా నిరోధిస్తున్నారు.బిడ్డకు 9నెలలు నిండగానే దీన్నిస్తారు కాబట్టి దీంతో చాలావరకూ సమస్య దరిజేరదు.ముఖ్యంగా పోషకాహారలోపం గలవారికి ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: