కాలం మారింది,మనుషులు మారారు,అవసరాలు పెరిగాయి.వీటితోపాటు కదలకుండ చేసే పనులవల్ల సుఖపడుతున్నాం అని అనుకుంటున్నాం,కాని అనారోగ్యాలను చంకలో పెట్టుకుని తిరుగుతున్నామనే ఆలోచన ఎవరికి రావట్లేదు.ఈ ఆధునిక కాలంలో పాదాలు కందిపోకుండా కాళ్లకు రక్షలు,ఒంటికి ఏసి,కడుపుకు జంక్ ఫుడ్ ఇవి మన నేస్తాలైన రోగాలు.టూకిగా చెప్పాలంటే మోడ్రన్ స్టైల్ పేరుతో కిచన్లో,పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలంఇది.ఇక సౌకర్యాలైతే అబ్బో ఇంట్లోమొత్తం నున్నని పాలిష్ బండలు,ఇంకా స్మూతైన చెప్పులు,ఎక్కడా పాదాలకు గరుకుతగిలేది లేదు.ఉదయం బెడ్ మీదినుండి దిగిందిమొదలు,మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు,వీలైతే స్లిప్పర్లు,లేకుంటే శాండిల్స్ ,కాకుంటే స్పోర్ట్స్ షూస్..ఇంకా అయితే ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్ష కాలను బిగించి మరీ మనపాదాల్ని కప్పేస్తున్నాం కాని ఇదిఎంతవరకు సేఫ్ అని ఒక్కసారికూడ ఆలోచించడంలేదు..




ఇలాచేసి పాదాలను రక్షిస్తున్నామని అనుకుంటున్నాం గాని శరీరానికి శిక్ష వేసుకుంటున్నామని చాలామందికి తెలియదు.పూర్వకాలంలో మన పూర్వీకులు ఎంత యాక్టివ్ గా వుండేవారో గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమేస్తుంది. వారు చెప్పులువేసుకోకుండ నిరంతరం గతుకుల రోడ్లల్లో,పొలం గట్ల వెంబడి తిరిగేవారు.కాని ఇప్పుడు అడుగుతీసి అడుగు వేయాలన్న బద్దకం, ఎందుకంటే ప్రతివారికి వాహనాలు అందుబాటులోకొచ్చాయి.అవిలేనివారు క్యాబ్స్ బుక్ చేసుకుని హాయిగా తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలా మందికి తెలియదు.ఇప్పటి నుంచైనా ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి లేకుంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు..ఐతే ఇలా చేయడం వల్ల కలిగే లాభాలేంటో  తెలుసుకుందాం.. 




శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది-పొత్తి కడుపుపై ఒత్తిడికలిగి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా,ఇసుక,చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా,మీ BP కంట్రోల్ అవుతుంది.ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.సహనం పెరుగుతుంది.మానవుని పాదాల్లో 72వేల నరాల కొనలు ఉంటాయి.ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి.చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి.వొంట్లోని కొవ్వు కరుగుతుంది.రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది.హార్ట్ ఎటాక్ లాంటివి రావడానికి అతి తక్కువ ఆస్కారం ఉంది.కాబట్టి ఇక మీదట.. పార్కుల్లో, ఆఫీస్లలో ఇంట్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి.ఒక సర్వే ప్రకారం ఎవరైతే ప్రతి వారం కనీసం2 గంటలు నడుస్తారో,అతను 40%వరకు మిగాతవారికన్నాఆరోగ్యంగా,వ్యాధులు అంత త్వరగా రాకుండా ఉంటాడు.చదివారుకదా రోజు వాకింగ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: