నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణంగా మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తాగకపోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే, మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు ఇప్పుడు మనం ఒక చక్కటి చిట్కాని చూద్దాం.


కావాల్సిన పదార్ధాలు:

సొంటి-50 గ్రాములు,

కరక్కాయ-50 గ్రాములు,

పాత బెల్లం-100 గ్రాములు,

తయారు చేసుకునే విధానం:

కరక్కాయలను తీసుకుని అందులో ఉన్న గింజలను తీసేసి కొంచెం దంచుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అలానే సొంటిని కూడా కొంచెం దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో దంచుకున్న సొంటి మరియు కరక్కాయను వేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టుకుని ఉంచాలి. అవి చల్లారిన తరువాత మిక్సీ వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని జల్లించి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు ఒక చిన్న రోట్లో పాత బెల్లం వేసుకుని బాగా దంచుకోవాలి. ఇలా దంచిన బెల్లంలో ముందుగా చేసిపెట్టుకున్న పొడిని వేసుకుని బాగా నూరుకోవాలి. ఇలా నూరుకున్న దాన్ని చిన్న చిన్న గోలీల ఆకారంలో  చేసుకుని ఉంచుకోవాలి. వీటిని ప్రతీ రోజు క్రమం తప్పకుండా తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


సొంటి వల్ల ఉపయోగాలు: అల్లంని ఎండబెట్టి తయారు చేస్తే వచ్చేది సొంటి. ఈ సొంటి పొడి అనారోగ్యాలు అన్నిటికి బాగా ఉపయోగ పడుతుంది. జలుబు,దగ్గు,జ్వరం వంటి వాటికి సొంటి అద్భుతమైన ఔషదం. అజీర్తిని పోగొడుతుంది. పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగ సొంటి పొడి, కొద్దిగ తేనె కలుపుకుని తాగితే కొవ్వు తగ్గడమే కాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది అంటున్నారు మన వైధ్యనిపుణులు.


కరక్కాయ వల్ల ఉపయోగాలు: ఆస్తమాకి ,ఆయాసానికి మంచి మందు. నోటి దుర్వాసనను పోగొడుతుంది, దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు కరక్కాయ రసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. విష జ్వరాలు తగ్గటానికి కరక్కాయతో తేనెని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: