స‌హ‌జంగా క్యాబేజీ ఆకుకూర అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. దీని స్మెల్ కార‌ణంగా చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. నిజానికి క్యాబేజీలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, బి1, బి6, బి2, సి, కె తదితర విటమిన్లతోపాటు కాల్షియం, ఐరన్, సల్ఫర్, పొటాషియం, పాస్ఫరస్, ఫోలేట్ తదితర పోషకాలు కూడా క్యాబేజీలో పుష్క‌లంగా ఉంటాయి. క్యాబేజీలో ర‌కాలు కూడా ఉంటాయి. దీనిలోని విలువైన పోషకాలు మేలైన ఆరోగ్య పరిరక్షణకు దోహదపడటమే గాక చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.


దీన్ని ఎలా వండుకుని తిన్నా రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. క్యాడేజీతో అనేక ర‌కాలు వంట‌లు చేసుకోవ‌చ్చు. కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనది అని చెప్ప‌వ‌చ్చు. క్యాబేజీ తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి..


- క్యాన్సర్‌ను నిరోధించటంలో క్యాబేజీ కీల‌క పాత్ర పోషిస్తుంది.  క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన `ప్లేవనాయిడ్స్` సమృద్ధిగా అందుతాయి. తద్వారా `పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్`ను నివారిస్తుంది.


- క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.


- క్యాబేజీల్లో ఎరుపు రంగులో ఉండే క్యాబేజీ రకాన్ని ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. అలాగే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయం చేస్తుంది.


- క్యాబేజీలో తక్కువ కేలరీలు ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీన్ని డైట్‌లో గ‌నుక చేర్చుకుంటే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.


- క్యాబేజీలోని గ్లుటామైన్‌ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌ అలర్జీలు, నొప్పి,వాపులను తగ్గిస్తుంది.  గాయాలు త్వరగా మానేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.


- అలాగే రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది నారింజలో కంటే క్యాబేజి లో ఎక్కువగా లభిస్తుంది.


- క్యాబేజీ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల ఎంత వయసు పెరిగినా నిత్య యవ్వనంగా కనిపిస్తారు. అలాగే శ‌రీరంలో ఉన్న‌ వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపి శ‌రీరాన్ని శుద్ధి చేయ‌డంలో క్యాబేజీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: