రాజ్మా, ఉలవలు, శనగలు, మినుములు వంటివి తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి బలంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో రాజ్మా విషయగ్రహణ శక్తిని పెంపొందించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను సమద్ధిగా కలిగివుంటుంది. ఇంకా రాజ్మాలో క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్జైమర్స్‌ బారినపడకుండా చూసే థైమీన్‌ కూడా ఉంటాయి. 
ఉలవల సంగతికి వస్తే.. ఇనుము, క్యాల్షియం వంటివి వీటిలో ఎక్కువ ఉంటాయి. యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఫాలిఫెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు, కొలెస్ట్రాల్‌, కడుపు ఉబ్బరం తగ్గటానికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


చిరుధాన్యాలలో ‘కిడ్నీ బీన్స్‌” ప్రత్యేకమైనవి. ఎరుపు, బ్రౌన్‌ రంగులో ఉండే వీటిని పోషకాల గని అని చెప్పొచ్చు. పీచుపదార్థం, ప్రొటీన్లతో నిండిన ఈ సూపర్‌ సీడ్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో. వీటి వల్ల ఒనగూరే ఇతర ఆరోగ్య లాభాలేమంటే..ఈ గింజల్లో పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూసి, రక్తపోటును నివారిస్తాయి. వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ రక్తంలోని కొలెస్ట్రాల్‌ నిల్వలను తగ్గిస్తాయి. 
కిడ్నీ బీన్స్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. ఇవి చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటిక్‌ సమస్య ఉన్నవారు వీటిని తింటే ఫలితం ఉంటుంది. వీటిలోని విటమిన్‌ బి1 జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. అల్జీమర్స్‌ ముప్పు నుంచి కాపాడుతుంది. ఈ గింజల్లోని మాంగనీస్‌ జీవక్రియల్ని వేగవంతం చేసి, ఆహారం నుంచి తొందరగా శక్తి విడుదలయ్యేలా చూస్తుంది.

ఈ గింజల్ని సరైన మోతాదులో తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పెద్దపేగు కేన్సర్‌ ముప్పూ తప్పుతుంది. వీటిలోని మెగ్నీషియం కొలెస్ట్రాల్‌ నిల్వల్ని తగ్గించి, రక్తనాళాలు మూసుకుపోకుండా చూసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీబీన్స్‌ తింటే మైగ్రేన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణులకు కావాల్సిన ఐరన్‌, ఫోలిక్‌ ఆమ్లం ఈ గింజల్లో లభిస్తాయి. రాజ్‌ మా గింజలు కిడ్ని ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ బీన్స్‌ అంటారు, వీటిని పవర్‌ హౌస్‌ అఫ్‌ ప్రోటీన్స్‌ గా పిలుస్తారు. మాంసం లో కంటే ఎక్కువ ప్రోటీన్స్‌ వీటిలో ఉంటాయి కనుక శాకాహారులకు మంచి పౌష్టికాహారంగా చెప్పవచ్చు. 
రాజ్‌ మా లోని పోషకాలు: క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషయం, పొటాషియం, మాంగనీస్‌ వంటి ఖనిజ లవణాలతో పాటు కాపర్‌, ఒమేగా ఫ్యాటి ఆసిడ్స్‌ లభిస్తాయి, దీనిలో ఫైబెర్‌ ఎక్కువగా కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. 


రాజ్‌ మా వలన లాభాలు: 
రక్తహీనతను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. భోజనం తర్వాత బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ ని తగ్గించడంలో రాజ్‌ మా లోని ప్రోటీన్స్‌ ఎంతగానో తోడ్పడుతాయి. 
షుగర్‌ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది, అందువల్ల షుగర్‌ వ్యాధిగ్రస్థులు తమ రెగ్యులర్‌ డైట్‌ లో వీటిని తీసుకోవడం మంచిది. 
మాంసాహారం కన్నా ఎక్కువ శక్తిని శరీరానికి అందిస్తుంది, అందువల్ల శాకాహారులకు మంచి ఎనర్జిటిక్‌ ఫుడ్‌ గా చెప్పవచ్చు. 
యాంటి ఏజింగ్‌ లక్షణాలను కలిగివుంటుంది, అందువలన ముసలితనాన్ని దరిచేరనివ్వదు. 
దీనిలో ఫైబర్‌ అధిక మోతాదులో ఉండడం వలన కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తుంది. మలబద్దక సమస్యను తొలిగిస్తుంది. 
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది. 
వీటిలో వుండే యాంటీ యాక్సిడెంట్స్‌ శరీరాన్ని ప్రీరాడికల్స్‌ బారినుండి కాపాడుతుంది. శరీరానికి హనిచేసే టాక్సిన్స్‌ ను మలినాలను విసరగించడం లో ఉపయోగపడుతుంది. 
ఎముకలను బలంగా చేస్తుంది, క్రీడాకారులకు మంచి ఆహారం.జుట్టు మరియు గొర్ల ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది 
మైగ్రేన్‌, కీళ్ల నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మతి మరుపు ని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: