మానవులకు కావలసిన పోషకహారపదార్థాలు కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి.అందువలన మనం తీసుకొనే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ప్రధానపాత్ర వహిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ ధరలలో లభ్యమయ్యే వీటిలో ఉండే విటమిన్లు,ఖనిజ లవణాలు,పిండి పదార్థాలు మానవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి.ఈ కూరగాయల్లో కొన్ని రకాలుంటాయి,వాటిలో తీగజాతి కూరగాయలు:బీర,కాకర,దొండ,పొట్ల,గుమ్మడి,బూడిద గుమ్మడి,దోస,కీర దోస,సోర. మొదలైనవి..ఇక దుంపజాతి కూరగాయలు:బీట్ రూట్,క్యారెట్,బంగాళ దుంప,ఉల్లిగడ్డ,చిలగడ దుంప,కంద, చామ .ఇవేగాక ,చిక్కుళ్ళులో రకాలు:గోరు చిక్కుడు,ఫ్రెంచ్ చిక్కుడు(సన్న చిక్కుడు),సోయా చిక్కుడు,పందిరి చిక్కుడు.సంవత్సరం పొడవున దొరికే కూరగాయలు.బెండ,టోమాటో,వంగ,పచ్చి మిరప.ఇన్ని రకాల కూరగాయలు మనశరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయనడంలో సందేహంలేదు.



మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఎక్కువ కూరగాయలు మరియు పండ్లను తినే వ్యక్తులు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల బారినుంచి తప్పించుకుంటారంటే నమ్మబుద్ది కాదు. ఎందుకంటే కూరగాయలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.చాలా కూరగాయలలో సహజంగా కొవ్వు మరియు కేలరీలు చాల తక్కువగా ఉంటాయి.కేవలం కూరగాయలను ఆహార పదార్ధాలుగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ సమస్య తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.మన శరీరానికి అవసరమైన పొటాషియం,డైటరీ ఫైబర్,ఫోలేట్ (ఫోలిక్ యాసిడ్),విటమిన్‘ఎ’ మరియు విటమిన్‘సి’వంటి అనేక పోషకాలకు కూరగాయలే ముఖ్యమైన వనరులు.



ఇవి డైటరీ ఫైబర్ రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గి స్తుంది.విటమిన్‘ఎ‘కళ్ళు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయ పడుతుంది.విటమిన్‘సి‘గాయాలను నయం చేయడంతో పాటుగా దంతాలు,చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇనుము అరుగుదలలో కూడా విటమిన్ సి సహాయపడుతుంది.ఆహారంలో భాగంగా కొన్ని కూరగాయలు మరియు పండ్లు అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ పొందవచ్చు.పొటాషియం అధికంగా ఉండే కూరగాయలు మరియు పండ్లను తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది,మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే ప్రమాదం కూడా తగ్గు తుంది మరియు ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది.సో పాఠకుల్లారా నాన్‌వెజ్ సాధ్యమైనంతవరకు తగ్గించి కూరగాయలు,ఆకుకూరలు వీలైనంతగా భుజించనికి ప్రయత్నించండి,ఆరోగ్యాన్ని కాపాడుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: