రాగుల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. ఆహారం పట్ల శ్రద్ధ వహించే నేటితరంలో రాగిపిండి చాలా ప్రసిద్ధి పొందింది. రాగులతో గంజి, రాగి రొట్టె, రాగి ముద్ద‌ మరియు ఇతర వేపుడు పదార్థాలను చేయడానికి ఉపయోగిస్తారు. వాస్తవానికి భారతదేశంలోని కొన్ని రాష్ట్ర‌ల్లో ప్రజలకు రాగిసంకటి, రాగిముద్ద ఆహారాలు ప్రధాన ఆహారంగా ఉంటాయి. 


ఆరోగ్య రిత్యా ఐరన్, కాల్షియం నిల్వలు అధికంగా ఉన్న రాగుల్ని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. రాగి ముద్ద‌ను డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.రాగిముద్ద చాలా ఆరోగ్యకరం. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. బీపీ, షుగర్ కంట్రోల్ లో చేయడంలో రాగిముద్ద బాగా స‌హ‌యాప‌డుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


రాగిలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఎముకలు, పళ్ళు  చాలా బలంగా, గట్టిగా ఉండటానికి తోడ్పడుతుంది. రాగి ముద్ద‌ను తిన‌డం వ‌ల్ల‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరియు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రాగులు మంచి ఆహారం. రాగుల్లో పుష్కలంగా ఉండే ఐరన్ అనే మూలకం రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. 


రాగిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తహీనతకు అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా రాగి ముద్ద‌ను తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్లు, మినరల్స్ మన శరీరాలను శారీరకంగా ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. అనేక పోష‌కాలు ఉండే రాగాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: