మనకు అనుభవంలేని విషయమేమిటంటే, మనం తరచుగా చేసే పనులలో కొన్నిటి మూలంగా మన జుట్టు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మన జుట్టు దుమ్ము బారిన పడుతూ ఉంటుంది. క్రమంగా జుట్టును శుభ్రంగా, ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా ఉంచడానికి మనం జుట్టును తరచుగా శుభ్రం చేయడం జరుగుతుంటుంది. అందమైన జుట్టును నిర్వహించడానికి అనేక రకాల గృహ చిట్కాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటాం.


క్రమంగా కొన్ని సహజసిద్దమైన ఉత్పత్తుల నుండి, మార్కెట్లో కొనుగోలు చేసే రసాయనిక ఉత్పత్తుల వరకు ఆధారపడుతాము. తల స్నానం చేసిన తరువాత మన జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. తల స్నానం చేసిన తరువాత చాలా మంది తలకి కండువాని చుట్టుకుంటారు, కాని ఇలా చేస్తే మన జుట్టుకి చాలా ప్రమాదం అని చాలా మందికి తెలియదు. మరి దీనికి ఏమి చేయాలి అని అనుకుంటున్నారా, చాలా సింపుల్ ఒక పాత టీషర్ట్ తీసుకుని తల స్నానం చేసిన తరువాత ఆ టీ-షర్ట్ ని తలకి చుట్టుకోవాలి. టీ-షర్టు మీ జుట్టు మీద అత్యంత సున్నితంగా ఉంటుంది మరియు ఒక టవల్ చేసినట్లు మీ జుట్టుకు నష్టం చేయదు

జుట్టు నుంచి అదనపు నీళ్లు తొలగిన తరువాత జుట్టుకు ఒక మంచి సీరమ్ రాసుకోవాలి. సీరమ్ రాసిన తరువాత సీరమ్ అప్లై చేయడం మూలంగా అది మృదువుగా మారుతుంది. అంతేకాకుండా, మంచి నిగారింపును జోడిస్తుంది. ఒక హెయిర్ సీరమ్ కూడా మీ జుట్టును సులభంగా చిక్కుతీయడానికి సహాయపడటమే కాకుండా జుట్టు నష్టానికి గురికాకుండా నిరోధించగలుగుతుంది. తడిగా ఉన్నపుడు జుట్టును దువ్వెన పెట్టి దువ్వకూడదు.


ఇలా దువ్వితే జుట్టు రాలిపోయి,తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా చెయ్యకుండా మన చేతి వేళ్ళతో జుట్టు చిక్కును తీసుకుని జుట్టును ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత దువ్వెనతో చిక్కు తీసుకోవటం మంచిది. మీరు తడి జుట్టును పొడిగా చేయడానికి బ్లో- డ్రయర్ వినియోగించినప్పుడు దాని వేడి, జుట్టు మీద ఉండే తేమపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా మీ జుట్టు పొడిగా మరియు పెళుసుగా మారుతుంది. అందువల్ల తడి జుట్టుపై వేడిని కలుగజేయడం మంచిదికాదని గుర్తుంచుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: