కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్.ఈ క్యారెట్‌లోనున్నగుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు.మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ,వండి తే మాత్రం ఇష్టపడరు.క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గి స్తాయనీ,ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా,మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపం లోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు,ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.ఇన్ని లాభాలున్న క్యారెట్‌ ను వండుకొని తినడమే కాదు,వివిధ రకాలైన స్నాక్స్ లు కూడ చేసుకోవచ్చు.అలాంటి ఓ స్నాకే క్యారెట్‌-సేమ్యా బొబ్బట్లు...ఇది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..





ముందుగా కావలసినవి:
క్యారెట్‌ తురుము:2 కప్పులు,
సేమ్యా:అరకప్పు,
ఎండుకొబ్బరితురుము:పావుకప్పు,
జీడిపప్పుపొడి:పావుకప్పు,
బెల్లం తురుము:4 టేబుల్‌స్పూన్లు,
పంచదార:4 టేబుల్‌స్పూన్లు,
మైదా:4 కప్పులు, పాలు:కప్పు,
నెయ్యి:2 టేబుల్‌స్పూన్లు




తయారుచేసే విధానం:ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు పోసి కాస్త నెయ్యి వేసి పూరీ పిండిలా కలపాలి.సేమ్యాను పొడిపొడి లాడేలా ఉడికించాలి.ప్రెషర్‌పాన్‌లో టేబుల్‌స్పూను నెయ్యి వేసి క్యారెట్‌ తురుము వేగనివ్వాలి.తరవాత పాలు పోసి ఉడి కించాలి.ఇప్పుడు పంచదార,బెల్లం తురుము వేసి కరిగేవరకూ ఉడికించాలి.చివరగా ఎండుకొబ్బరి తురుము, జీడిపప్పుపొడి వేసి కలపాలి.ఉడికించిన సేమ్యాను కూడా వేసి కలిపి చిన్న ఉండల్లా చేసుకోవాలి. మైదాపిండిని పూరీలా చేసి దాని మధ్యలో క్యారెట్‌-సేమ్యా మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి చేత్తోనే బొబ్బట్ల మాదిరిగా వత్తాలి.ఇలాగే అన్నీ చేసి పెనంమీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చితీయాలి. ఇంకేముందు మంచి పోషక ఆహరం తయారైనట్లే..ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ ఎము కలకు,చర్మానికీ కావలసిన అత్యావశ్యకమైన ఆహరం.అంతేకాదు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగ పడుతుంది.వెంటనే ప్రయత్నించి చూడండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: