జామకాయ అంటే ఇష్టపదని వారుంటారా.అందుకే ఇది పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరీకి ఇష్టమైన పండు అని చెబుతారు..తీపి,వగరు,పులుపు మూడు రుచుల మేలైన కలయికే ఈ జామకాయ.అందుకే పేదల పాలిటి ప్రియ నేస్తం అంటారు..మార్కెట్లో ఉండే పండ్లలో అన్నింటికంటే చౌకైనది అందుకే ఇది బాగా పాపులర్ అయ్యింది.గ్రీన్ కలర్లో నోరూరించే జామకాయ అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.కేవలం రుచి మాత్రమే కాదు,అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.జామకాయ, జామపండు రెండింటిలోనూ మినిరల్స్, విటమిన్స్, ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి లు ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చును.ఈ పండులోని యాంటీ ఆక్సిడెట్స్, ఒమేగా -3, 6, ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి.వాస్తవంగా చెప్పాలంటే వీటిలో ఉండే న్యూట్రీషియన్ గుణాలు ఇతర ఫ్రూట్స్ లో కంటే వీటిలో ఎక్కువ.అంతే కాకుండా ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల న్యూట్రీషియన్స్,మినిరల్స్ ను అందిస్తుంది.



ఇక ఈ జామకాయ జ్యూస్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం..
తయారీ 1. ముందుగా జామకాయ తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి కప్పులో తీసుకోవాలి. 2. తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి, పంచదార , కోల్డ్ వాటర్ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. 3. ఇప్పుడు ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. పూర్తి విత్తనాలన్నింటిని తొలగించాలి. 4. ఈ జ్యూస్ కు ఐస్ క్యూబ్ మరియు పుదీనా ఆకులును జోడించి ఫ్రెష్ గా తాగితే ఆ మజాయే వేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: