చిన్న పిల్లలకి మనుషులకంటే ... తమకి ఇష్టమైన బొమ్మలతో ఉండే అనుబంధం చూడ ముచ్చటగా ఉంటుంది . వాళ్ళ కి ఇష్టమైన బొమ్మలు కాసేపు కనపడపోయిన గోల గోల చేసేస్తుంటారు  పిల్లలు. ఆ బొమ్మని తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం తప్ప ...వాళ్ళని ఊర్కో పెట్టడానికి వేరే మార్గమే ఉండదు . అచ్చం  ఇలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది .ఓఖ్లా మండిలో కూరగాయల దుకాణం నడిపే మొహద్ షెహజాద్ అనే వ్యక్తి భార్య ఫరీన్, 11 నెలల కూతురు జిక్రా మాలిక్‌ ఉంది . ఈ కుటుంబం  ఢిల్లీ గేట్ సమీపంలో ఉంటుంది .కాగా జిక్రా దురదృష్టవశాత్తు మంచం పైనుంచి పడటంతో ఎడమ కాలు విరిగింది.



దీంతో ఆమెని లోక్ నాయకుల ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు జిక్రా 15  కిలోల కంటే తక్కువ బరువు ఉండటం తో ట్రాక్షన్ పద్దతిలో కళ్ళు పైకి కట్టి ట్రీట్ చేశారు . కాగా జిక్రా ఏడుస్తూనే ఉండటంతో జిక్రా తో పాటు మరో పేషంట్ కి కూడా డాక్టర్లు ట్రీట్ మెంట్ చేయాల్సి వచ్చింది . ఇంతకీ ఇంకో పేషంట్ ఎవరు అనుకుంటున్నారా ... జిక్రా కి ఇష్టమైన బొమ్మ . ఈ బొమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చి అచ్చం ఆమెలాగే దానికి కట్టుకట్టి వేలాడదీశారు . అంటే జిక్రా ఏడుపు ఆపేసింది. ఆ బొమ్మని చూసి హాయిగా నవ్వటం మొదలు పెట్టింది . ఈ సంఘటనతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోగా ... ఇప్పుడు ఈ చిట్కా ఆస్పత్రిలో చర్చనీయాంశమైంది.



కాగా పారి బొమ్మ తన కూతురు జిక్రా కి చాల ఇస్తామని ... ఆ బొమ్మను తన తో ఉంచటం వల్లే తొందరగా కోలుకుందని తండి మొహద్ షెహజాద్ తెలిపాడు. దీంతో జోక్యాన్ని అక్కడ వార్డులో ఉన్న వాళ్ళందరూ గుదియ వాలి బాచి అని పిలుస్తున్నారట.    


మరింత సమాచారం తెలుసుకోండి: