చికెన్ సరిగ్గా వండాలే కాని ఎంతో టేస్టీ వంటకం.ముఖ్యంగా బ్యాచిలర్స్ దాదాపుగా చికెన్ తినని రోజంటూ వుండదు.హోటల్ కు ఎవరైనా వెళ్లారంటే ముందుగా ఆర్డర్ చేసేది చికెన్ బిర్యానినే. ఇక ఈ సీజ‌న్‌లో చాలా మందిని బాధించే సమస్య గొంతులో నొప్పి.గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌,మంట‌, స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోవ‌డం వంటి ఇబ్బందులు అన్నీవ‌స్తాయి. కొంద‌రికి సీజ‌న్ మారిన‌ ప్పుడ‌ల్లా గొంతు నొప్పి వ‌స్తుంటుంది.అయితే ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే ప‌లు స‌హ‌జ సిద్ధ ప‌దార్థా లు చాలు.అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అక్క‌ర్లేదు.ఈ క్ర‌మంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్‌గా త‌గ్గించేది వేడి చికెన్ సూప్‌..గొంతు నొప్పి,ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటే ఓ బౌల్‌లో వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఇలా కొన్నిరుగ్మతలకు చికెన్ సూప్ చక్కని ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.ఇక ఆ చికెన్ సూప్ ను ఎలా తయారు చేస్తారో చూద్దాం..




కావాల్సినవి :
బోన్‌లెస్‌ చికెన్‌-పావు కిలో..
క్యారెట్‌-ఒకటి..
స్వీట్‌కార్న్‌-అరకప్పు..
నిమ్మరసం-రెండు టేబుల్‌స్పూన్లు,.
అల్లం-చిన్నముక్క,
వెల్లుల్లి-రెండు రెబ్బలు,.
నూనె లేక నెయ్యి-ఒక టీస్పూన్‌..
బిర్యానీ ఆకు- ఒకటి..
మిరియాలు-నాలుగైదు,
దాల్చిన చెక్క-చిన్నముక్క...



తయారీ విధానం.. అల్లం,వెల్లుల్లి మెత్తగా దంచుకోవాలి.కుక్కర్‌లో చికెన్‌ తీసుకుని మూడు కప్పుల నీళ్లు పోయాలి.బిర్యానీ ఆకు,దాల్చిన చెక్క,మిరియాలు వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం,వెల్లుల్లి వేసి వేగించాలి.తరువాత క్యారెట్‌ ముక్కలు,స్వీట్‌కార్న్‌ వేసి మరికాసేపు వేగించాలి.ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్‌ సూప్‌ను అందులో పోసి మరికాసేపు ఉడికించాలి.తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి. నిమ్మ రసం,మిరియాల పొడి చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి...రుచితో పాటు ఆరోగ్యాన్నిస్తుంది ఈ సూప్..

మరింత సమాచారం తెలుసుకోండి: