వంకాయ తెలియ‌ని వారుండ‌రు. ఇది `కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్` అన్న విష‌యం అంద‌రికి తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంకాయ పడుతుంది. తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో వంకాయ ఒక‌టి. వంకాయతో అనేక విధాలుగా కూర‌లు చేయ‌వ‌చ్చు. అలాగే దీన్ని ఇష్ట‌ప‌డేవారు కూడా ఎక్కువే. అయితే వంకాయ తిన‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.


వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువైన ఇనుమును తొలగిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తుంది. క్యాన్సర్ క‌ణాల‌ను నివారించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.


అలాగే నిద్ర‌లేమితో బాధ‌ప‌డేవారికి వంకాయ బాగా ప‌ని చేస్తుంది. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పుతో తింటే  గాస్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి. వంకాయ‌లో ఉండే పీచుపదార్దము వ‌ల్ల శ‌రీరంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును. అయితే గ‌ర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు. ఎలర్జీలకు దారితీయును. వంకాయ చాలా మందికి దురద, ఎలర్జీని కలిగించును. అలాంటి వారు వంకాయ‌కు దూరంగా ఉండ‌డం మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: