ఈ కాలంలో ఏమైనా అనారోగ్యసమస్యలు వస్తే జనరల్‌గా స్వంత వైద్యం చేసుకుంటారు.ఐతే మనం తెలియక వాడేమందులతో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆలోచించం.అవి కొన్ని కొన్ని సార్లు వెంటనే ప్రభావం చూపితే మరికొన్ని సార్లు కాస్త సమయం తీసుకుంటాయి.ఇంకా వర్షకాలం,చలికాలం వేధించే సమస్యలు శ్వాసకోస ఇబ్బందులు.వీటిలో ఆస్తమా మాత్రం ఆజన్మాంతం వెంటాడుతూనే ఉంటుంది.తొలకరి పలకరిస్తే చాలు ఆస్తమా బాధితులు బెంబేలెత్తిపోతుంటారు.ఉబ్బసంతో సతమతమవు తుంటారు.తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఇన్‌హేలర్‌ వాడుతుంటారు.ఈ ఇన్‌హేలర్‌ వాడే ఆస్తమా బాధితుల శరీరాలు వైద్యానికి అంతగా సహకరించడం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలిందట.




ఆస్తమాతో పాటు వారికి ఏ ఇతర జబ్బులు వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు అమెరికాలోని నేషనల్‌ జెవిష్‌ హెల్త్‌ సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ మైఖేల్‌ వెష్లర్‌.ముప్పయ్‌,ఆపై వయసుకలిగిన 1,200 మంది ఆస్తమాపేషంట్లను మైఖేల్‌టీమ్‌ స్టడీ చేసింది.దానిలో తేలిన అంశమేంటంటే ఆస్తమాను పూర్తిగా తగ్గించలేక పోవడం వెనుక కారణం ఇన్‌హేలర్‌ వాడకం ఒక ప్రధాన కారణమని తెలిపింది..సాధారణంగా ముప్పయ్‌,ఆపై వయసు బడిన వారిలో 17.3 శాతం ట్రీట్‌మెంట్‌ఫెయిల్యూర్స్‌ నమో దయ్యాయట.ముప్పయ్‌ ఏళ్లకు తక్కువున్న వారిలో ఇది 10.3 శాతంగా నమోదవ్వగా ఆస్తమా ప్రభావం స్త్రీ,పురుషులపై దాదాపు ఒకే విధంగా ఉందని వారు చెబుతున్నారు.సో ఇప్పటినుండి ముక్కు దిబ్బడగా వుందని అస్తమానం ఇన్‌హేలర్ వాడటం తగ్గిస్తే మంచిదని,ఇక అస్తమా పేషెంట్స్ చలిలో గాని వర్షంలో గాని తిరగక పోవడం,తడవక పోవడం మేలని డాక్టర్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: