సీజనల్ ఫీవర్స్ , డెంగ్యూ జ్వరాలపై సమీక్ష నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈ సమేవేశానికి స్పెషల్ సియస్ శాంతకుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగిత రాణా, వైద్య విధాన పరిషత్ కమిషనర్,  అరోగ్య శ్రీ సీఈఓ  మాణిక్ రాజ్, డిఎంఈ రమేష్ రెడ్డి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, టీఎస్ ఎంఎస్ఐ డిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కమిషనర్ టీవివిపి  అశోక్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్  హాజరయ్యారు. జ్వరాల నియంత్రణకు, చికిత్సకు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలను మంత్రి వివరించారు. సాయంత్రం ఓపి సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లలో ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా మరో 4 వారాల పాటు రోజంతా ఓపీ సేవలు అందిస్తున్నారు.  డెంగ్యూ జ్వరం పరీక్షలు పూర్తిగా ఉచితం. ప్రతి హాస్పిటల్ లో బోర్డులు పెట్టీ మరీ రోగులకు ఈ విషయం తెలిసేలా చేస్తున్నామని చెప్పారు.






ప్రతి ఆసుపత్రిలో అదనపు కౌంటర్ లను  ఏర్పాటు చేశామన్నారు. ఆయా కౌంటర్ ద్వారా క్యూ లైన్లో వేచి ఉండే సమయమును తగ్గించడంలో సఫలీకృతమైనట్టు మంత్రి ఈటెల తెలిపారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు హాస్పిటల్ కి వచ్చిన 20 నిమిషాల్లోనే వారికి చికిత్స అందించే ఏర్పాటు చేశామన్నారు.  చెరువులు, కుంటలు, మూసి నదిపై డ్రోన్ల సహాయంతో స్ప్రేయింగ్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి 15 రోజులకీ ఒక సారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో ఫాగింగ్ చేస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలకమండలి (జీహెచ్ ఏంసి) పరిధిలో శానిటేషన్, దోమల నియంత్రణపై ప్రతి రోజు సమీక్ష చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. జీహెచ్ ఏంసి పరిధిలో యూపీహెచ్ సి, బస్తీ దావాఖానాలో సాయంత్రం క్లినిక్ లను నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రస్తుత పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.





ఇప్పటికీ 500 హెల్త్ క్యాంపులు నిర్వహించామన్నారు. జీహెచ్ ఏంసిలో 309 డెంగ్యూ,151 మలేరియా వచ్చే ప్రదేశాలను గుర్తించినట్టు చెప్పారు. అక్కడ దోమల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ములుగు, భద్రాద్రి, హైదరాబాద్ జిల్లాలో మలేరియా వ్యాప్తి చెందుతుందన్నారు. ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, మేడ్చల్, పెద్దపల్లి, అదిలాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలో డెంగ్యూ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని హై రిస్క్ జిల్లాలుగా ప్రకటించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటెల రాజేంద్ర కోరారు. రాష్ట్రంలో డ్రై డే పాటించాలన్నారు. దోమలు కుట్టకుండా జాగ్రత తీసుకోవాలని సూచించారు. కాచి వడగాచిన నీటిని తాగాలని చెప్పారు. జ్వరం రాగానే భయపడవద్దు. అన్ని పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. ఫీవర్ హాస్పిటల్ లో 6 ఓపీ కౌంటర్లు ఉంటే 25 కౌంటర్లకు పెంచామన్నారు. డాక్టర్స్ సెలవులను రద్దు చేశామన్నారు. సాయంత్రం క్లినిక్ లను నడుపుతున్నాను. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని బీవీ ప్రజలను మత్రి కోరారు. 





ఈ జ్వరాలని అరికట్టడానికి ఏం చెయ్యాలో కలెక్టర్ ల సమావేశంలో సీఎం కెసిఆర్ గారు చాలా స్పష్టంగా కలెక్టర్ లకు తెలిపారు. ఇంకా పకడ్బందీగా చేయడానికి  ఎల్లుండి  పంచాయితీ రాజ్, విద్యా శాఖ,  జీహెచ్ ఏంసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అవసరం లేని దగ్గర ఉన్న వైద్యులను ఒత్తిడి ఎక్కువ ఉన్న దగ్గర పని చేయిస్తామన్నారు.  సరిగా పని చేయని వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది నాయకులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రజలను మరింత భయపెడుతున్నారని పరోక్షంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని విమర్శించారు. వారు ప్రభుత్వంలో ఉన్నపుడు, చేసే అవకాశం ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు నీతులు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తమ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ ప్రభుత్వఆసుపత్రులు ఆదివారం పని చేయలేదు కానీ తాము  చేయిస్తున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: