మందారం ఓ అందమైన పువ్వుల చెట్టు అని మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ మందారం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో చాలా మందికి తెలియ‌దు. మందారంలోని ఔషద గుణాల వల్ల అద్బుత ప్రయోజనాలున్నాయి. మందారం అందానికి ఉప‌యోగిస్తారు అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అలాగే ఆరోగ్యానికి కూడా మందారం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక రోగాల‌కు మందారం టీ మంచి ఔష‌దంగా ప‌ని చేస్తుంది. 


అధిక బరువు, రక్తపోటు పై శ్రద్ద పెట్టాలనుకొనే వారు సులభంగా తయారు చేసుకొనే ఈ టీని వినియోగించటం మంచిది. దీన్ని క్రమం తప్పకుండా రోజుకు మూడు కప్పుల టీ తాగితే చాలా మంచిది. ఇక మందారం టీ ప్ర‌యోజ‌నాలు ఇప్పుడు తెలుసుకుందాం..


- మందార టీలోని హైపోలిపిదేమిక్, హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహం వంటి చక్కర రుగ్మతలతో బాధపడేవారికి ప్రయోజనం కలిగిస్తుంది. క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.


-  మందార పువ్వుల టీ తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇది లివర్‌లో ఉన్న కొవ్వు కరిగిస్తుంది. 


- మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. రక్త సరఫరా స‌క్ర‌మంగా సాగుతుంది.


- మందార టీ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.


-  మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: