వర్షాకాలంలో కలుషిత నీరు, దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల మెరుగైన చికిత్సను అందించగలుగుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.  2017 తో పోలిస్తే డెంగ్యూ జ్వరాల  తీవ్రత తక్కువగా ఉందన్నారు. ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా గణనీయంగా తగ్గడంతో లేదు. కేవలం 5 శాతం మందిలో మాత్రమే ప్లేట్ లెట్స్ ఎక్కించల్సిన అవసరం వచ్చిందని చెప్పారు.  మంగళవారం కోటి లోని వైద్య విద్యా సంచలకుల కార్యాలయంలో జరిగిన సమావేశంలో డెంగీ చికిత్స, నివారణ పై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.  ప్రస్తుతం వస్తున్న జ్వరాల్లో 80 శాతం సాధారణ వైరల్ జ్వరాలు మాత్రమే ప్రబలుతున్నాయని అన్నారు. కాబట్టి ప్రజలు జ్వరాల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.




వైద్య ఆరగ్యశాఖ తీసుకుంటున్న చర్యల వల్ల డెంగ్యూ వ్యాధిని ముందే గుర్తించ గలుగుతున్నామని చెప్పారు. ఏ క్రమంలో  డెంగ్యూ పరీక్షలు చేసే సెంటర్ల సంఖ్యను కూడా పెంచామన్నారు.  పరీక్షలు చేయడానికి అవసరమైన అన్ని రకాల  పరికరాలను అందుబాటులో  ఉంచినట్టు తెలిపారు. ఆగస్ట్ నెలలో  700 ల వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు డెంగ్యూ వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని మంత్రి ఈటెల స్[అష్టమ చేశారు. జ్వరాల తీవ్రత దృష్ట్యా  ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.  రెండు రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్  పూర్తిగా ఈ అంశం మీదనే సమీక్షలు నిర్వహిస్తున్నారు.





ఫీవర్ హాస్పిటల్ నీ పరిశీలించారు. ఇక్కడికి వచ్చిన రోగుల్లో ఎక్కువ మంది మేడ్చల్ జిల్లా  దమ్మాయి గూడ ప్రాంతానికి చెందిన వారేనని చెప్పారు.  కాగా కోఠిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. గత ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని అంది సుఖ సంతోషాలతో ఉన్నారని, ఈసారి కూడా నిర్విఘ్నంగా ప్రభుత్వ పథకాలు అన్ని అంది, ప్రభుత్వ కార్యకలాపాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థించునట్లు  తెలిపారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని కోరినట్లు మంత్రి  రాజేందర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: