ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.ఆ ఆరోగ్యం,ఆరోగ్యంగా ఉండాలంటే లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయాలి.శరీరంలోని జీర్ణ‌వ్య‌వ‌స్థ‌,మెట‌ బాలిజం,శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి,పోష‌కాల‌ను నిల్వ చేసుకోవ‌డం.త‌దిత‌ర ప్ర‌క్రియ‌లు స‌రిగ్గా జ‌ర‌గాలంటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలి.లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటే ఆ జీవ‌క్రియ‌ల బాధ్య‌త‌ను లివ‌ర్ స‌రిగ్గా నెర‌వేరుస్తుంది.అంతే కాకుండా.ర‌క్తంలోని మ‌లినా ల‌ను తొల‌గించేందుకు,ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో,శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలోనూ లివ‌ర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ఈ ప‌నుల‌న్నింటికీ ఆటంకం ఏర్ప‌డి,అనారోగ్య స‌మ‌ స్య‌లు వ‌స్తాయి.క‌నుక లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 




1.లివ‌ర్‌లో ఎంజైమ్స్‌ని ఉత్సాహపరిచి,వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బయటకు పంపడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.క‌నుక నిత్యం
2 లేదా 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే లివ‌ర్ సురక్షితంగా ఉంటుంది.
2. బీట్‌రూట్స్ లో ఫ్లేవనాయిడ్స్,బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటాయి. అందువ‌ల్ల లివ‌ర్ లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. క‌నుక నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం లేదా బీట్ రూట్‌ను తిన‌డం చేస్తుంటే లివ‌ర్ ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు.
3. నిమ్మ‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.ఇవి లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి.లివ‌ర్ ఆరోగ్యాన్నిపరిర‌క్షిస్తాయి.కనుక నిత్యం నిమ్మ‌కాయ‌ను వాడితే లివ‌ర్‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.




4. రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, కొవ్వుకు కారణమయ్యే కారకాలను బయటకు పంపడం తేలికవుతుంది.అంతేకాదు లివ‌ర్‌ సంబంధిత వ్యాధులను నిరోధించడానికి గ్రీన్‌ టీ చక్కటి పరిష్కారం చూపుతుంది.
5. శరీరంలో ఫ్యాట్స్ సులభంగా జీర్ణమవడానికి పసుపు ఉపయోగపడుతుంది.అంతేకాదు పాడైన లివర్ క‌ణాల‌ను మళ్లీ ఉత్పత్తి చేయడంలో పసుపు సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో పావు టీ స్పూన్‌ పసుపు వేసి మరిగించాలి. కొన్ని వారాలపాటు రోజుకి రెండుసార్లు దీన్ని తీసుకుంటే మంచిది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.
6. రోజుకి ఒక యాపిల్‌ తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.యాపిల్స్‌లో ఫైబర్‌ తోపాటు పెక్టిన్‌ ఉంటుంది.ఇది టాక్సిన్స్‌ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.రోజూ ఒక గ్లాసు యాపిల్‌ జ్యూస్‌ తీసుకున్నా సరిపోతుంది.దీంతో లివ‌ర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: