సామాన్యంగా కొంత వయస్సు వచ్చాక బాధించే సమస్య కీళ్ల నొప్పులు..ఇవి ఎవ‌రికైనా వ‌చ్చాయంటే చాలు,ఇక ఆ స‌మ‌స్య ఎలా ఉంటుందో అది మాటల్లో చెప్ప‌లేం.ప్ర‌ధానంగా మోకాళ్ల‌తోపాటు ఎముక‌లు విప‌రీత‌మైన నొప్పిని క‌లిగిస్తాయి.దీంతో అడుగు తీసి అడుగు వేయ‌డం,కూర్చోవ‌డం,నిల‌బ‌డ‌డం చాలా క‌ష్ట‌ంగా అనిపిస్తుంది.అయితే సాధార‌ణంగా ఒక‌ప్పుడంటే వ‌య‌స్సు మ‌ళ్లిన వారికి,వృద్ధుల‌కు ఎక్కువ‌గా కీళ్ల నొప్పులు వ‌చ్చేవి.కానీ నేటి కృత్రిమ యుగంలో చిన్న వ‌య‌స్సులోనే కీళ్ల నొప్పుల బారిన ప‌డుతున్నారు.దీంతో ఆ నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం హాస్పిట‌ల్స్‌కు తిర‌గ‌డం,ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం,అయినా ఫ‌లితం ఉండ‌క‌పోతుండ‌డంతో ఏం చేయాలో వారికి తెలియ‌డం లేదు.ఈ క్ర‌మంలో ఆ స‌మ‌స్య‌తో రాజీ ప‌డిపోయి కొంతమంది అలాగే నొప్పుల‌తో జీవ‌నం సాగిస్తున్నారు.కానీ కింద ఇచ్చిన ఓ సూచ‌న‌ను పాటిస్తే ఎటువంటి కీళ్ల నొప్పినైనా కేవ‌లం కొద్ది వారాల వ్య‌వ‌ధిలోనే దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది.



బాగా పండిన చింత కాయ‌ల మ‌ధ్య‌లో వున్న చింతగింజ‌లను స‌రిగ్గా వాడితే కీళ్ల నొప్పుల‌ను ఎఫెక్టివ్‌గా త‌గ్గించుకోవ‌చ్చు. ఎలాగంటే కొన్ని చింత గింజ‌ల‌ను సేక‌రించి వాటిని బాగా వేయించాలి.అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టి. రోజుకు రెండు సార్లు నీటిని మారుస్తూ,2 రోజుల త‌రువాత చింత గింజ‌ల‌ను తీసి వాటిపైన వున్న పొట్టును తీసెయ్యాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి నీడ‌లో ఎండ‌బెట్టాలి.అలా ఎండిన ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టాలి.ఆ పొడిని జార్‌లో నిల్వ చేసుకోని రోజుకు రెండు సార్లు దీన్ని అర టీస్పూన్ మోతాదులో నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకోవాలి.



పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అంతేకాదు 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం ప‌డుతుంది.ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి.దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తం గా విముక్తి ల‌భిస్తుంది. అయితే పైన చెప్పిన మిశ్ర‌మం కేవ‌లం కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌ గా ఉండ‌డం,ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌,గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.అయితే ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: