జామపండు తినటానికి అందరు ఇష్టతారు. కానీ దీని వల్ల‌ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చ‌ర్యానికి గురవుతారు. అతి తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి, ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు. ఎక్కవ పీచు పదార్ధం కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎ, బి, సి విటమిన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వయసుకు ముందే ముఖం పై ముడతలు, చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.


జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి. అలాగే  అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయలో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది. దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు, చర్మానికి చాలా మంచిది. 


అంతే కాకుండా జమకాయలో బీ కాంప్లెక్స్ విటమిన్స్, ఈ, కె విటమిన్స్ ఉంటాయి.  ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలలోను జామ‌ లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: