గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి డివిసన్ సోనియాగాంధీ కాలనీకి సంబంధించిన సందపల్లి ఉప్పలయ్య, పారిజాతం దంపతుల పిల్లలు అయిన అఖిల్, శివశరన్ లు గత 5 సంవత్సరాలుగా "మస్కల్ డిస్ట్రోపి" అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నరు. ఈ వ్యాధితో వీరి కాళ్ళు చచ్చుపడిపోయాయి. అంతేకాకుండా శరీరంలోని ఒక్కొక కండరము పని చేయకుండా పోయాయి. దీనివల్ల  వల్ల ఆ చిన్నారులు తమ పనులు చేసుకోలేకపోతున్నారు. స్కూల్ కు కూడా వేళ్ళ లేకపోతున్నారు. పేదరికంతో బాధ పడుతున్న ఉప్పలయ్య కుటుంబం ఈ అరుదైన  వ్యాధి కారణంగా  పిల్లలు పడుతున్న బాధ గురుంచి నగర మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తీసుకువచ్చారు. 





చిన్నారులు పడుతున్న అవస్థలపై  మేయర్ రామ్మోహన్ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆ ఇద్దరు పిల్లలకు "పవర్ విల్ ఛైర్"లను అందచేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లల బాధను అర్థం చేసుకొని వారికి " పవర్ విల్ చైర్"లను అంద చేశారు. మేయర్ రామ్మోహన్ కు ఆ పిల్లల తల్లిదండ్రులు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా నగరంలో చెత్తను తరలించేందుకు రెండు టన్నుల సామర్థ్యం గల





స్వచ్ఛ ఆటో నమూనాను మేయర్ రామ్మోహన్, కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ లు పరిశీలించారు. పర్యావరణహిత సి.ఎన్.జితో నడిచే రెండు టన్నుల గార్బేజ్ ను తరలించే వీలుగా టాటా కంపెనీ ఈ సి.ఎన్.జి వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం పనితీరు, తక్కువ నిర్వహణ సామర్థ్యం, ఏకో ఫ్రెండ్లీగా ఉంటుందని, ఈ వాహనం ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు. ఈ గార్బేజ్ తరలింపు వాహన పనితీరును పరిశీలించి వీటిని సేకరించే విషయంపై తగు నిర్ణయం తీసుకోనున్నట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: