జిమ్ లో గడిపే క్షణాలు,రాత్రిని మధురక్షణాలతో నింపేస్తాయా, వ్యాయామం సెక్స్ డ్రైవ్ ని పెంచుతుందా,అని ప్రశ్నిస్తే అవును, పెంచుతుంది అని అంటున్నారు పరిశోధ కులు.కెనెడాలో 2000 మంది పురుషులు కొంతమంది మహిళలపై జరిగిన ఓ సర్వేలో 65% మంది చెప్పిన విషయ మేంటంటే వ్యాయామం తమ శృంగార జీవితానికి కొత్త ఊపునిచ్చిందని అభిప్రాయపడ్డారు.ఎందు కంటే జిమ్ లో వ్యాయామం చేసిన తరువాత లిబిడో పెరుగుతుందని,కామోద్రేకము ఉచ్ఛ స్థితికి చేరుకుంటుందని,దాంతో అంగ స్తంభనలు కూడా మెరుగ‍్గా ఉంటాయని పురుషులు చెబితే,వ్యాయామం చేసే సమయంలో,కొన్నిరకాల వ్యాయామాల వలన ఎక్సర్ సైజ్ ఇండ్యూస్ట్ ఆర్గజమ్ కూడా కలగుతుందని మహిళలు చెప్పారు.



ఇలా ఎందుకు జరుగుతుంది అంటే,టెస్టోస్టిరోన్,ఎండార్ఫిన్ లెవల్స్ వ్యాయామం వలన పెరుగుతుందట.ఇక ఈ జిమ్ చేయడం వల్ల పురుషుల కంటే,మహిళల్లోనే కామో ద్రేకాన్ని ఎక్కువ కలుగజేస్తుందని పరిశోధకులు అంటున్నారు.బైకింగ్,క్రంచెస్,రోప్ క్లయింబింగ్ వంటి వ్యాయామల వలన,కండరాల్లో ఫ్రిక్షన్ ని ఫీల్ అయ్యి,“ఆ మూడ్”లోకి వస్తారట అమ్మాయిలు..కాబట్టి,మెరుగైన శృంగార జీవితం కోసం,జిమ్ లో చెమట ధారబోస్తే మంచిది అన్నమాట.ఇక జిమ్ కెళ్లి కుస్తీలు పడటానికి ముందు కావలసింది ఒకటుంది.అదే ఆరోగ్యం.ముందుగా పై వన్ని జరగాలంటే దీనికంతటికీ కావల్సిందల్లా ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండటమేనని చెపుతున్నారు.



ఆరోగ్యకరమైనా ఆహరపదార్ధాలు తీసుకుంటూ ఇందుకోసం ప్రతి రోజూ వ్యాయామం తప్పక చేయాలని అందువల్ల అలవడే మంచి అలవాట్లు సెక్స్‌‌ని నిత్యనూతనంగా ఉంచుతుందని చెపుతున్నారు.కొందరు వయస్సు మళ్ళిందని మ్యారేజ్‌ మానుకోన వసరం లేదు.ఇక ఆ వయస్సులో పెళ్ళెందుకని మ్యారేజ్‌ చేసుకోకుండా వుంటే ఇక జీవితాంతం మిగిలేది అసంతృప్తేనని తెలుపుతూ,స్త్రీకి గాని,పురుషునికి గాని ఒకగానొక సమయంలో తోడు కావాలనిపిస్తుంది.యుక్తవయస్సులో సెక్స్‌ కోసమని తోడు కావలనిపిస్తే, ప్రౌఢవయస్సులో,వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి తోడు కోసం తోడు కావాలని కోరుకుంటారని చెపుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఆహ్లాదకరమైన మనస్సు ఉంటుందని, అందువల్ల శృంగార భావాలు చక్కగానే ఉంటాయని మానసిక నిపుణులు చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: