స్వీట్ తింటే బ‌రువువు పెరుగుతామ‌ని, లావు అయిపోతామని, సుగర్ వచ్చేస్తుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అయితే చక్కెరతో ప్రమాదం పొంచి ఉంది కానీ.. బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇదివరకటి రోజుల్లో స్వీట్లు తయారు చేయాలన్నా బెల్లమే ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం స్వీట్స్ అంటే చక్కెరకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బెల్లం వాడితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


స్వీట్స్ తినడం ఇష్టం లేనివారు మధ్యాహ్నం కానీ, రాత్రి భోజనం తరువాత కానీ చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపి లివర్ శుద్ధి చేసే అద్భుతమైన గుణం బెల్లంలో ఉంది. గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం కలిపి తాగినా.. టీలో చక్కెర బదులు బెల్లం కలిపి తీసుకున్నా మంచిది.


అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణాలు బెల్లంలో ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మహిళలు తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత నివారించవచ్చు. ఇన్ని సద్గుణాలున్న బెల్లంను రెగ్యులర్ డైట్ లో కాస్త చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతే త‌ప్పా స్వీట్ తింటే సుగ‌ర్ వ‌స్తుంద‌ని... లేదా బ‌రువు పెరుగుతామ‌ని అనుకునే వాళ్లు పంచ‌దార బ‌దులుగా బెల్లం ఉప‌యోగిస్తే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: