స‌పోటా అంద‌రికి తెలిసిందే. పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే.. నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది. సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. సపోటా పండు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది.  ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి.


అలాగే ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండు ఎముకల గట్టితనానికి, విస్తరణకు బాగా సహాయ పడుతుంది. ఇక పోషకాల విషయానికి వస్తే.. స‌పోటాలో ఉండే విటమిన్‌ 'ఏ 'కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ 'సీ 'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అందువల్ల చిన్నపిల్లలకూ, వృద్ధులకూ కూడా స‌పోటా ఇవ్వవచ్చు.


ఇంకా ఇందులో సోడియం , పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి.  గర్భవతులకు, పాలిచ్చే తల్లులు స‌పోటా తిన‌డం చాలా ఉపయోగకరం. ఇది నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అదే విధంగా తియ్యగా, భలే రుచిగా ఉన్నాయికదా అని సపోటా పండ్లను ప‌రిమితికి మంచి తినటం మంచిది కాదు. అలా చేస్తే అజీర్ణంతోపాటు పొట్ట ఉబ్బరం కూడా చేస్తుంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తీసుకోకూడదు.



మరింత సమాచారం తెలుసుకోండి: