మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి పచ్చిదైనా, పండైనా, చివరికి ఎండినా సరే దానిలో ఔషధగుణాలు మెండుగా ఉంటాయి. మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. మామిడిలో ఉండే చక్కెరలు, పీచు శరీరానికి మేలు చేస్తాయి అయితే మామిడి చూర్ణంతో కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇందులో ఉండే విటమిన్ ఏ, సి, డి, బి6 శరీరానికి హాని కలిగించే  విషతుల్యా లను తొలగిస్తాయి. మామిడి చూర్ణంలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులను ఇది నివారిస్తుంది. మామిడి చూర్ణంలో ఐరన్ ఉంటుంది. ఐరన్ సమస్యలతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే శరీరానికి తగిన ఐరన్ లభిస్తుంది. మామిడి చూర్ణం గుండెకు మేలు చేస్తుంది హృద్రోగ సమస్యలు నివారించే ఆయుర్వేద ఔషధాల్లో మామిడి చూర్ణాన్ని వాడతారు.


ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. మామిడి చూర్ణంలో ఉండే విటమిన్ సి శరీరంలో అనవసర కణాలను తొలగించి క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. మామిడి చూర్ణంలో విటమిన్ ఏ, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: