విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించి కొన్ని బ్యూటీ చిట్కాలు తెలుసు కుందాం.

పెదాలు మృదువుగా మారాలంటే:

పెదాలు మృదువుగా మారటానికి ఒక కప్పులో అర టీస్పూన్ తేనె తీసుకుని దానిలో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్స్ కట్ చేసి వేయాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుంటే పెదాలు చాలా మృదువుగా కోమలంగా తయారవుతాయి.


కంటి కింద నల్లటి వలయాలు పోవాలంటే:

కంటి కింద నల్లటి వలయాలు పోవాలంటే ఒక కప్పులో అర స్పూన్ కొబ్బరి నూనె లేదా బాదం నూనెను తీసుకోవాలి. దానిలో ఒక విటమిన్ క్యాప్సిల్ కట్ చేసి వేయాలి. అన్నింటినీ బాగా కలపాలి, ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తుంటే నల్లటి వలయాలు మాయం అయిపోతాయి.

మడమల పగుళ్లు తగ్గాలంటే:


మడమల పగుళ్లు తగ్గాలంటే ఒక కప్పులో వ్యాజిలిన్ తీసుకోవాలి. అందులో ఒక విటమిన్ క్యాప్సిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయేముందు పగిలిన మడమలకు రాసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల పగిలిన మడమలు మెత్తగా మృదువుగా తయారవుతాయి.


జుట్టు రాలకుండా ఒత్తుగా ప్రకాశవంతంగా ఉండాలంటే:గోరువెచ్చగా చేసిన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో ఒక విటమిన్ ఈ క్యాప్సుల్స్ ఆయిల్ వేసి బాగా కలిపి తలమీది రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక అర గంట ఐన తరువాత తలస్నానం చెయ్యాలి.


విటమిన్ ఇ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన తలపై చర్మంలో అన్ని భాగాలకు రక్త సరఫరా అయి జుట్టు మొదళ్ళ నుండి చివరి వరకు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: