కిస్సంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి,అందులో అమ్మాయితో ముద్దంటే ఎవరికైన చేదా.! కానే కాదు అమ్మాయి ముద్దిస్తా రమ్మంటే చంకలుఎగరెసుకుంటూ వెళ్లేవారున్నారు.ఇక పార్కుల్లో పబ్బుల్లో చాటుమాటుగా ఈ ముద్దుల మద్దెలదరువు మోగుతూనే ఉంటుంది.అయితే ఈ ముద్దనేది ఒక మనుషులకు మాత్రమే అన్ని మసాలలను ఒంట్లో రంగరిస్తూంది.అది అమ్మాయితో ఐతేనే..ఇక తల్లి పిల్లలకు పెట్టే ముద్దులో ఆప్యాయత వుంటే,లవర్స్ పెట్టుకునే ముద్దులో కోరిక వుంటుంది. అయితే భార్య భర్తలు కానివ్వండి,లవ్ బర్డ్స్ కానివ్వండి జంటగా రెండు పెదాలు కలిపి పెట్టుకునే ముద్దువల్ల ఎన్ని లాభాలు వున్నాయంటే తెలిస్తే ఆశ్చర్యపోతారు.ముద్దులకోసం ఆరాట పడతారు.. అందుకే కిస్సింగ్ వల్ల కలిగే ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..



ఫ్రెంచ్ కిస్,ఇంగ్లిష్ కిస్,అధరచుంబనం,ఇలా ముద్దుల్లో అనేకరకాలు ఉన్నాయి.మన దగ్గరైతే దాన్నిశృంగార ప్రక్రియలో ఒక భాగంగా తీసుకుంటారు.ఇక విదేశాల్లో ఐతే ముద్దు పెట్టుకోడం అనేది చాలా కామన్.మరి ముద్దు పెట్టుకోవడమనే క్రియ ద్వారా వారి ఆరోగ్యానికి మంచే జరుగుతుందట.కపుల్స్ ఎక్కువ సంతోషంగా ఉంటారట.ఒకరి భావాలను మరొకరితో పంచుకునేందు కు కూడా ముద్దు ఉపయోగపడుతుందట.అంతేకాకుండా స్ట్రెస్,డిప్రెషన్ దూరమై,ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడు తుందట,ఎందుకంటే ముద్దు పెట్టుకునే ప్రక్రియలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుందట.కాబట్టి దీని వల్ల వివిధ రకాల నొప్పులు తగ్గిపోతాయట.



అంతేగాక ముద్దు పెట్టుకునే సమయంలో ఎక్కువగా ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) దంతాలను సంరక్షిస్తుందట.దీని వల్ల దంత క్షయం దూరమవడంతోపాటు వాటిలో పేర్కొన్నవ్యర్థాలు తొలగింప బడతాయట.కిస్ చేయడం వల్ల సెరటోనిన్, డోపమైన్,ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇవి రిలాక్స్‌డ్ ఫీలింగ్‌ను ఇవ్వడమే కాదు,మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయట.అంతేకాదు తలనొప్పి కూడా తగ్గిస్తాయట.ఇంతటితో అయిపోలేదు ముద్దు పెట్టుకోవడంవల్ల ఆడ,మగ ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.మెడ,దవడ కండరాలకు వ్యాయామం జరిగి అవి మంచి షేప్‌కు వస్తాయట.ఇక బాడిలో నిమిషానికి 2 నుంచి 3 క్యాలరీలు ఖర్చవుతాయట.దీంతోపాటు శరీర మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుందట.ఈ క్రమంలో బరువు తగ్గేందుకు రక్తపోటును నియంత్రించడంలోనూ కిస్సింగ్ బాగానే పనిచేస్తుందట.అయితే ఇది దంతాలను,నోరును శుభ్రంగా ఉంచుకునే వారు చేస్తే బాగుంటుందని పరిశోధకులు తెలుపుతున్నారట..


మరింత సమాచారం తెలుసుకోండి: