ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రతి మనిషి ఈ ఉరుకులు,పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడిల మధ్య,ఎన్నో సమస్యల మధ్య బతుకుతున్నాడు,అంతే కాకుండా  ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో నెలకొకసారి అయిన ఆసుపత్రికి వెళ్తున్నారు.ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె నొప్పితో బాధపడుతున్నారు,చూడాటానికి ఆరోగ్యంగా కనిపిస్తాడు,కాని లోపల గుండె మాత్రం అంతగా ఆరోగ్యంగా ఉండదు.ఇది ఈ కాల జీవన విధానంలో మానవుని దుస్దితి,తీసుకునే ఆహారంలో కల్తీ,ఆలోచనల్లో కల్తీ,టెన్షన్ టెన్షన్ పడుతూ వుండే బ్రతుకూ.ఇవన్ని ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి.కొన్ని సంవత్సరాల క్రితం వరకు 50 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే గుండెనొప్పితో బాధపడేవారు,కానీ ఇప్పుడు 25 ఏళ్ళు కూడా నిండని వారు కూడా గుండె నొప్పితో బాధపడుతున్నారు.



ఇక ప్రతివారు మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 25 ఏళ్ళ వయసువారిలో గుండె నొప్పి మరణాలు పెరిగిపోతున్నాయి, మొదటిసారి వచ్చినప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే గుండె నొప్పిని చాలావరకు నియంత్రించవచ్చు.గుండె నొప్పి రావడానికి ముందు మన శరీర ఆరోగ్యంలో కొన్ని మార్పులు జరుగుతాయని,పరిశోధనలు చేసిన వైద్యులు తెలిపారు,గుండె నొప్పి లక్షణాలని ముందే గమనించి తగిన చికిత్స చేయించుకుంటే ప్రాణాలని కాపాడుకోవచ్చని, తీవ్రమైన గుండె నొప్పి రావడానికి నెలరోజుల ముందు నుండే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి,తెలిపారు అందుకే వాటి గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..



గుండె నొప్పి రావడానికి ముందు కనిపించే లక్షణాలు:
1..గుండెనొప్పి రావడానికి ముందే కనిపించే లక్షణాలలో ముఖ్యమైనది శరీరంపై భాగంనుండి ఎడమచేయి కిందివరకు నొప్పి ఉండటం,ఇలా అనిపిస్తే ఆలస్యంచేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
2..ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా,ఏదో బ‌రువు ఛాతిపై పెట్టిన‌ట్టుఅనిపిస్తున్నా అది హార్ట్ఎటాక్‌కు సంకేతంఅవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు.వైద్యున్నిసంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
3..హార్ట్ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాసఆడ‌క‌పోవ‌డం.గాలిపీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులువ‌స్తుంటే దాన్ని హార్ట్ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.



4..ఎప్పుడు మత్తుగా ఉంటడం,చెమట ఎక్కువగా రావటం అనేవి కూడా గుండె నొప్పిని సూచిస్తాయి.
5..ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా,తిన్నఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా,గ్యాస్‌,అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా,క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటినికూడా హార్ట్ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి.ఎందుకంటే చాలామంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతీనొప్పిగా పొరపడుతుంటారు.
6..జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా,అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే.ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి..
చూసారుగా నూరేళ్ల జీవితానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్నేళ్లు హాయిగా బ్రతక వచ్చూ..


మరింత సమాచారం తెలుసుకోండి: