ముఖానికి అందంగా మేకప్ వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని ఏ పార్టీకో లేదా ఫంక్షన్ కో వెళతారు కానీ, అకస్మాత్తుగా తలలో దురద పెడితే ఏం చేయాలో తెలియదు, వేళ్ళతో తలను గోకితో తెల్లగా పొట్టువలె రాలుతోంది. డ్రెస్ మీద తెల్లగా పడంటం చూసి మీకే సిగ్గు వేస్తుంది. ఓరి దేవుడా చుండ్రా అని అప్పుడు అలర్ట్ అవుతారు. చుండ్రు వివిధ రకాలుగా భాదిస్తుంది. చుండ్రు నలుగురిలో నవ్వుల పాలు చేయడం మాత్రమే కాదు, ఇటు సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

జుట్టు సంరక్షణ విషయంలో విలన్ గా మారిన ఈ చుండ్రు విషయం చిన్నదే అయినప్పటికీ, ఇది కలుగుజేసే సమస్యలు చిన్నవి కావు. ఈ చుండ్రు ఏవిధంగా మిమ్మల్ని బాధపడెతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది చుండ్రే కదా అని కొట్టిపారేస్తుంటారు. దాని వెనుక చాలా ఇబ్బందులున్నాయన్న విషయం గుర్తించరు. చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది. ఇంకా జుట్టు పల్చ బడటం, జుట్టు చిట్లడం జరుగుతుంది. దాంతో జుట్టు అందం తగ్గిపోవటమే కాకుండా చర్మ అందాన్ని కూడా తగ్గిచ్చేస్తుంది. కాబట్టి ఉన్న అందాన్ని కాపాడుకుంటూ, చుండ్రు సమస్యను నివారించుకోవడానికి ఒక మంచి అద్భుతమైన చిట్కాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

రైస్ వాటర్ ట్రీట్మెంట్ :

ఆయుర్వేదం ప్రకారం బియ్యం, నీళ్ళు జుట్టుకు చాలా మంచిది అలానే చుండ్రును కూడా నివారించడంలో సహాయపడుతుంది. దీనికి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎలా అంటే బియ్యం కడిగిన నీళ్ళను పక్కన పెట్టుకోవాలి,అన్నం వండిన తర్వాత అన్నం వార్చే గంజి పక్కకు తీసి ఉంచాలి. తలకు షాంపు పట్టించిన తర్వాత ఈ రైస్ వాటర్ లేదా గంజిని తలకు పట్టించి ఉంచాలి. 1015 నిముషాలు తర్వాత సున్నిత్నంగా మసాజ్ చేయాలి. తర్వాత నార్మల్ వాటర్ తో తలను శుభ్రంగా కడగాలి, ఇలా చేయడం వల్ల చుండ్రుకు వ్యతిరేఖంగా పోరాడే సిరియస్ యాంటీబయోటిక్స్ ను ఉత్పత్తి చేసి చుండ్రు నుండి విముక్తిని కలిగిస్తుంది. ఇంకా జుట్టుకు మంచి షైనింగ్ ని మరియు జుట్టు మొదళ్ళకు బలాన్నిస్తుంది. ఇలా రైస్ వాటర్ ను తలకు రెగ్యులర్ గా వాడుతుంటే తప్పనిసరిగా చుండ్రును పూర్తిగా నివారించవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: