ఇప్పుడు నడిచే సీజన్ చాల ప్రమాదకరంగా వుంది,ముఖ్యంగా పిల్లలకు విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి.అసలే వానకాలం,వచ్చేది చలికాలం.అందుకే ఇది జ్వరాల సీజన్ అని చెప్పవచ్చు.మామూలుగా జ్వరం ఎక్కువైనప్పుడు పిల్లల్లో బాడి టెంపరేచర్ చాల పెరిగిపోతుంది.నార్మల్‌గా ఒక వ్యక్తిలో 98.6 F గా ఉండే బాడీ టెంపరేచర్ జ్వరం రాగానే క్రమంగా 103 F వరకు వెళుతుంది.అందువల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.అందుకే ఏం తినాలనిపించదు,నోరంతా చేదు చేదుగా మారుతుంది.నీరసంతో నిద్ర ఆవహిస్తుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే,ముందుగా బాడీ టెంపరేచర్ను కంట్రోల్ చేయాలి.అలా చేస్తే జ్వరాన్ని తగ్గించినట్టే అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..



ఓ కప్పు పెసరపప్పును తీసుకొని,దానిని నీటితో కడిగిన తర్వాత ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి.20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగిపించాలి.ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది.ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు.అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది.ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి.దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను తప్పక వాడుతుండాలి.



పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి,అందువల్ల పెసరపప్పును ఓ 20 నిమిషాల నానబెట్టడం వల్ల ఆ గుణాలన్ని నీటిలో కలుస్తాయి.అంతే కాదు పెసలలో విటమిన్ బి,విటమిన్ సి,మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.అంతేకాకుండా సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు,పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది.పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం..కొన్ని కొన్ని సందర్భాలలో ఈ జ్వరాలు ప్రాణాలు కూడ తీస్తాయి అందుకే వీలైనంతగా అనారోగ్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: