నువ్వులు అంద‌రికి తెలిసిన‌వి, అందుబాటులో ఉండేవి. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే దాగున్నాయి. నువ్వులు శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని పెంపొందించే అన్నిరకాల పోషకాలను కలిగి ఉంటాయి. మరియు నువ్వుల నూనె వల్ల‌ చర్మ రక్షణ, జుట్టు రాలకుండా నివారిస్తాయి. నువ్వుల్లో మినరల్స్‌, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌, థయామిన్‌, విటమిన్‌ 'ఇ' లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే చాలారకాల మూలకాలు వీటిలో ఉంటాయి.


నువ్వు గింజల్లో నూనె పదార్థంతో పాటు ప్రోటీనూ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి తెల్ల, నల్ల నువ్వులు అని రెండు రకాలు. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్‌, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్లోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ వీటిని విరివిగా వినియోగిస్తారు. నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది.


నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులు ఒమేగా -3, ఒమేగా -6 మరియు ఒమేగా -9 ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. నువ్వులు ఫైబర్ కలిగి ఉంటాయి వీటిని ‘లిగ్నిన్స్’ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. హైబీపీతో బాధపడేవారు నువ్వులనూనెతో చేసిన వంటకాలు తినాలి. నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపు చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: