సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది బీర‌కాయను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీర‌కాయ వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. సులువుగా జీర్ణమయ్యే కూరగాయల్లో బీర‌కాయ ఒక‌టి. విరేచన కారి కూడ. అందువలన పథ్యంగా బీరకాయ చాల మంచిది. లేత బీరపొట్టు వేపుడు జ్వరం ను తగ్గిస్తుంది. బీరకాయలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి, దీన్ని మన రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి. బీరకాయలో పందిర బీర, పొట్టి బీర, నేతిబీర, గుత్తిబీర అని వివిధ రకాలున్నాయి.


అయితే బీర కాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గుదాం అనుకునే వాళ్లకు ఇది చక్కటి ఆహరం. ఆకలి తీరుస్తూనే బరువు తగ్గించడంలో బీరని మించింది లేద‌ని అంటున్నారు నిపుణులు. ఇక బీర‌కాయ‌లో పుష్క‌లంగా ఉండే పీచు ప‌దార్థం ద్వారా మలబద్దకం, జీర్ణ సమస్యలు మాయమవుతాయి. దీనిలో ఉండే బీటా కెరోటిన్ అనే పదార్ధం రక్తాన్ని శుభ్ర పరిచి కంటి చూపును మెరుగు పరుస్తుంది. అదే విధంగా లివర్‌, గుండె పనితీరుని మెరుగు పరచడంలో కూడా బాగా స‌హాయ‌ప‌డుతుంది.  


బీర లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల మలబద్దకమే కాకుండా పైల్స్ ఉన్నవారికి దివ్యౌషధం లాగా పనిచేస్తుంది. ఇక రోజూ ఒక గ్లాసు బీర జ్యూస్ తాగితే కామెర్ల వ్యాధి కూడా సహజంగానే తగ్గుతుంది. బీరకాయలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మధుమేహాన్ని నిరోధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది . బీరకాయలోని పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్ లోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్‌గా ప‌ని చేస్తుంది. మరియు బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో తోడ్ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: