కాలానుగుణంగా తినే ఆహారంలోను మార్పులు కూడా వస్తుంటాయి. బయట దొరికే కొవ్వు ఉన్న ఫుడ్స్ అంటే పీజ్జాలు, బర్గర్ లు వంటి వాటికి ఎక్కువగా మంది అలవాటు పడ్డారు. అందుకే ఆన్లైన్ ఫుడ్ యాప్ లు కూడా ఎక్కువయ్యాయి. మన బద్దకమే మనకు మనకు అనేక రకాల ఆరోగ్య సామాజీలను తెచ్చిపెడుతుంది కూడా అయినా మనం రుచి పేరుతో వాటినే ఎక్కువగా తింటాము. 

వివరాల్లోకి వెళితే.. బరువు పెరగడానికి కారణం బాడీలో తగ్గిన సి విటమిన్ అని చాలా మంది సి విటమిన్ దొరికే ఆహారం కోసం పరుగులు తీస్తారు. అలా కూరగాయలు, ఆకుకూరలు అంటూ నానా రకాల ఆహారం తీసుకుంటారు. శరీరానికి విటమిన్ సి ఎంతలా ఉపయోగపడుతుంది అంటే మన శరీరంఎప్పుడు యాక్టివ్ గా ఉండాలంటే విటమిన్ సి తప్పనిసరి. ఎందుకంటే దీనిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ విటమిన్ సి వల్ల శరీరంలోని అధిక కొవ్వును ఈ విటమిన్ తగ్గిస్తుంది.  ఇకపోతే మనిషి ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలంటే సి విటమిన్ కంపల్సరీ అంటున్నారు వైద్యులు. విటమిన్ సి మన బాడీలో తక్కువగా ఉంటే… ఇంకేముంది మన నడుం చుట్టూ… రింగులాగ కొవ్వు పేరుకుపోయి… పొట్ట కనిపిస్తుంది.

ఈ విటమిన్ ఎక్కువగా పుల్లని పదార్థాల్లో ఎక్కువగా దొరుకుంది. నిమ్మకాయలు, అరెంజ్స్, బెర్రీ, మామిడికాయ, జామకాయ, బ్రకోలి, మొలకలు, ఉసిరి, కివి, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, కాలీఫ్లవర్ మొదలగువాటిలో పుష్కలంగా లభిస్తుంది.  ఈ సి విటమిన్ తగ్గితే అనేక సమస్యలు వస్తాయి అందుకే రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇప్పటి నుండైనా కూడా సి విటమిన్ దొరికే ఆహారాన్ని తీసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: