ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య షుగర్. వయసుతో సంబంధం లేకుండా షుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్ ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. సహజ సిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే షుగ‌ర్‌ను నియంత్రిండానికి బిర్యానీ ఆకు గ్రేట్‌గా ప‌ని చేస్తుంది. బిర్యాణీ రుచి అంతా బిర్యానీ ఆకు లోనే వుంటుంది.


ఈ ఆకు రుచి కోసం వంటల్లో వాడుతుంటారు. అయితే ఒక పరిశోధన ఈ ఆకు షుగర్ వ్యాధి నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంద‌ని వెల్ల‌డించారు నిపుణులు. బిర్యానీ ఆకు వ‌ల్ల మ‌నకు ఇంకా ఎన్నో లాభాలు కూడా క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ ఆకుల‌తో న‌యం చేసుకోవ‌చ్చు. బిర్యానీ ఆకులు మ‌రిగించిన నీళ్లు రోజుకు రెండు, మూలు సార్లు తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. బీర్యానీ ఆకుల వ‌ల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ బద్దం చేసి డయాబెటిస్ కంట్రోల్ లోకి తెస్తుంది.


అలాగే నరాల పనితీరుకి బిర్యానీ ఆకులో విటమిన్‌ బి, పాంటోథెనిక్‌ ఆమ్లం, ఫైరాడిక్సిన్‌, రైబో ఫ్లేవిన్‌ అధికంగా లభిస్తాయి. శరీరంలోని ఎంజైముల పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి.  బిర్యానీ ఆకు పొడిని రోజూ తీసుకుంటే ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అదే విధంగా కంటిచూపుకి అవసరమైన విటమిన్‌ ఎ బిర్యానీ ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన కంటిచూపుకి సహాయపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: