ఈ చల్లని ఉదయానికి వెచ్చని కాఫీ ఇచ్చే హాయి ఇంకా ఏ దాంట్లో ఉండదు. బండి కదలాలంటే పెట్రోల్ ఉండాలి.. మనిషి నడవాలంటే కప్పు కాఫీ గొంతులో దిగాల్సిందే. అలాగైతే మనిషి పని సాఫీగా సాగుతుంది. అయితే, కాఫీ కంటే అస్సాం టీ లో ఎన్నో ఓషదాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి ఆ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో ఇప్పుడు చూద్దాము. 

ఈ అస్సాం టీలో ఎన్నో సుగుణాలు ఉండటం వల్ల అక్కడ టీ ఆకు పెంపకాన్ని ఎక్కువ చేశారు. దాదాపుగా మన దేశంలో పండించే దాని కన్నా ఎక్కువగా అక్కడ సాగు చేస్తారంట. ఓ పారి ఈ టీ లోని ఆరోగ్య ప్రయోజనాలు చుడండి. 
అస్సాం టీ లో మినరల్స్ మరియు యాంటియోక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ టీ  రోగనిరోధక శక్తీ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గుకు మంచి ఔషధం గా ఉపయోగపడుతుంది.
అస్సాం టీ ప్రతిరోజు తాగితే ,మన శరీరంలో ఉండే ఉపయోగంలేని కొవ్వుని నియంత్రిస్తుంది. జీవక్రియ పెరుగుదల మెరుగుపరుస్తూ శక్తివంతమైన బూస్ట్ ని ఇస్తుంది

అస్సాం టీ లో క్రిమిసంహారక ఔషధ గుణాలు అధికంగా ఉండటం వలన కాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. నిత్యం ఈ టీ తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. 
మలబద్ధకంతో  బాధపడేవారు ప్రతిరోజు భోజనం తరువాత ఒక కప్ అస్సాం టీ తీసుకోవటం వలన ఆ సమస్యను పూర్తిగా దూరం చేసుకోచ్చు. 
దంత సమస్యలు తో బాధపడేవారు ఈ టీ ఆకులను నమలటం వలన పంటి సమస్యలను తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. 

అస్సాం టీ ప్రతిరోజు తీసుకోవటం వలన గుండె జబ్బులు, రక్తపోటు, రక్తం గడ్డకట్టటం వంటి వ్యాదులు నుంచి దూరంగా ఉండొచ్చు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఆ అస్సాం టీ తయారు చేసుకోవాలంటే.. 
ముందుగా స్టవ్ వెలిగించి.. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళుపోసి, ఒక స్పూన్ అస్సాం టీ ఆకులను వేసి బాగా మరిగించాలి. కొంచం చల్చార్చి ఒక గ్లాసులో వేసి తాగితే చాలా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు కూడా ట్రై చెయ్యండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: