కోడిగుడ్డు,అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల పోషకాల్ని అందించే గుడ్డు.ఈగుడ్డు ను రోజువారి ఆహారంలో తీసుకుంటే శరీరానికి మేలు చేసే హెచ్‌డిఎల్‌ కోలెస్ర్టాల్‌ పెరిగి, చెడు కోలెస్ర్టాల్‌ అంతమవుతుంది.వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచుతుంది.కోడిగుడ్డు వల్ల రక్తనాళాల్లో ఎలాంటి సమస్యలు,గుండెజబ్బులు రావని పరిశోధనల్లో తేలిందట.ఇక ఈ గుడ్డులో కెరోటినాయిడ్లు,ల్యాటిన్‌,జెక్సాంతిన్‌ అనే పోషక పదార్థాలు మెండుగా ఉంటాయట.ఒక గుడ్డులో ఆరుగ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది.అంతే కాకుండా దీనిలోని అమైనో ఆమ్లాలు తొమ్మిది రకాల శరీర అవయవాల పనితీరును మెరుగు పర్చేందుకు ఉపయోగపడటమే కాకుండా,గుడ్డులో ఉండే 300 మైక్రోగ్రాముల కొలైన్‌ మెదడు పనితీరుకు,నాడీ వ్యవస్థ బలం పుంజు కోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.నిత్యం కోడిగుడ్డు తినడంవల్ల శరీరానికి అవసరమయిన విటమిన్స్‌, మినరల్స్‌,కార్బొ హైడ్రేట్లు,ఖనిజాలు సమపాళ్ల లో  అందుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.అందుకే ఇది సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే అద్భుతమైన పోషక ఆహారం అని అందుకే ఈ గుడ్డు వెరిగుడ్డూ అని ఎందరో చెబుతుంటారు ఇక దీనివల్ల ఎన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయో తెలుసుకుందా..



కోడుగుడ్డులోని పోషకాలు::ఒక గుడ్డులో ఫోలెట్‌ ఐదు శాతం,సెలీనియం 22శాతం,ఫాస్ఫరస్‌ తొమ్మిది శాతం,మిటమిన్‌ A ఆరు శాతం,విటమిన్‌ బి2,15శాతం,బి5 ఏడు శాతం,బి12 తొమ్మిది శాతం,ఇంకా విటమిన్‌ డి,ఈ,కె, కాల్షియం,జింక్‌ లాంటి ఖనిజాలు లభిస్తాయి.ఒక కోడిగుడ్డులో 1.5గ్రాముల పచ్చసొన 213మిల్లీ గ్రాముల మంచి కొలస్ర్టల్‌ను అందిస్తుంది.కాగా గుడ్డు ద్వారా 75కేలరీల శక్తి లభిస్తుంది.పిల్లలకు నిత్యం గుడ్డుతినిపిస్తే,ఎ,బ్యాటిన్‌,జెక్సాంధిన్‌ లాంటి యాంటి ఆక్సిడెంట్లు రేచీకటి రాకుండా ఆపడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి..ఒకగుడ్డులోని తెల్లసొనను ఒక కప్పు పాలతో కలిపి,రెండు చెంచాల తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలోని అన్ని రకాల విషాల విరుగుడుకు పని చేస్తుందట.ఇక ఈ గుడ్డు తెల్లసొనతో పలు రకాల రోగాలు నయం అవడమే కాకుండా శారీరక బలహీనతతో ఉన్నవారు,క్షయవ్యాధి గ్రస్తులు, గర్భిణీలు,కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకి టానిక్‌లా పని చేస్తుంది.



ప్రతిరోజూ రాత్రి సమయంలో ఉడికించిన గుడ్డులోని పచ్చసొనకు చెంచాడు తేనె,రెండు బాదం పప్పులను కలిపి తీసుకుంటే కొద్దిరోజులకు నరాల బలహీనత తగ్గడమే కాకుండా,మానసిక అలసట తీరిపోయి,నిద్రలేమి నుంచి విముక్తి లభిస్తుందట.ఇక రెండు చెంచాల తెల్లసొన,ఐదు గ్రాముల సబ్బునురగను కలిపి పేస్టుగా చేసి బెణుకుల నొప్పులపై రాస్తే త్వరగా ఉపశమం లభిస్తుందట.ఇంతే కాకుండా సౌందర్యానికి కూడా ఈ గుడ్డును వాడొచ్చట.ఎలాగంటే,ముఖం మీద మచ్చలు,మొటిమలు, గాట్లు,గరుకు దనం పోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన,చెంచాడు మీగడ,రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసు కొని,మర్థన చేసి ఉదయం నులివెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.ఇలా చేయదం వల్ల ముఖం తేటగా,మృదువుగా మారుతుందట.గుడ్డులోని తెల్లసొనను తలపై సున్నితంగా మర్థన చేసుకుని, నులివెచ్చని నీటితో తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా పెరుగడమే కాకుండా.జుట్టు రాలడం,చిట్లడం ఆగిపోయి నిగనిగలాడుతూ కురులు మేరుస్తాయట..చూసారుగా,గుడ్డు అని తేలికగా తీసేసే దానివల్ల ఎన్ని లాభాలున్నాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: