ఇటీవల కాలంలో వైట్ లెస్ తో పిల్లలు పుట్టడం సర్వసాధారణమైపోయింది. అలాంటిది  ఈ బేబీ ఏకంగా తొమ్మిది పౌండ్ల బరువుతో పుట్టింది మరి. బిడ్డ పుట్టిన సమయం, బరువు చూసి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. బిడ్డ పుట్టిన తేదీ, సమయం, బరువుపై ఆస్పత్రిలో మహిళా సేవల విభాగం సారథి రేచల్ లాగ్లిన్ స్పందిస్తూ- ఇలాంటి కాకతాళీయమైన సందర్భాలు చాలా అరుదన్నారు. ఆమె బరువు తొమ్మిది పౌండ్ల 11 ఔన్సులని తెలిసిన తర్వాత ఆస్పత్రిలో అందరూ ఆశ్చర్యపోయారు. శిశువు బరువు కేజీల్లో చెబితే దాదాపు 4.4 కేజీలు. "క్రిస్టీనా పుట్టిన సమయాన్ని వైద్యులు ప్రకటించడం తామున్నామని  బేబీ తండ్రి జస్టిన్ బ్రౌన్ పేర్కొంటున్నారు.




2001 సెప్టెంబరు 11న ఇస్లామిక్ మిలిటెంట్లు హైజాక్ చేసిన విమానాలతో న్యూయార్క్‌లోని డబ్ల్యూటీసీ భవంతులపై దాడి జరిపి నేల కూల్చారు. దాడిలో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌పైనా, పెన్సిల్వేనియాలోనూ నాడు దాడులు జరిగాయి. అమెరికా 9/11 దాడుల వార్షిక దినమైన సెప్టెంబరు 11న రాత్రి 9 గంటల 11 నిమిషాలకు 9 పౌండ్ల 11 ఔన్సుల బరువుతో తనకు బిడ్డ పుట్టిందని, తను ఓ అద్భుతమని అమెరికా మహిళ చెబుతున్నారు. కాగా విషాదకరమైన రోజైన సెప్టెంబరు 11న బిడ్డ జననం తమకు సంతోషాన్నిఇచ్చిందన్నారు. ఇది చాలా అరుదు సంఘటనగా పరిగణించారు.




టెనెసీ రాష్ట్రం జర్మన్‌టౌన్‌లో ఉన్న మెథడిస్ట్ లెబాన్హర్ ఆస్పత్రిలో పుట్టిన ఈ శిశువు పేరు క్రిస్టీనా బ్రౌన్. క్రిస్టీనా- నాటి విధ్వంసం జ్ఞాపకాల మధ్య ఈ లోకంలోకి వచ్చిన కొత్త వెలుగు అని తల్లి కామెట్రియోన్ మూరె-బ్రౌన్ చెప్పారు. బుధవారం దాడుల పద్దెనిమిదో వార్షిక దినం సందర్భంగా- న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రం(డబ్ల్యూటీసీ) భవనాలు కూలిన ప్రదేశం 'గ్రౌండ్ జీరో' వద్ద, పెంటగాన్, పెన్సిల్వేనియా, ఇతర ప్రాంతాల్లో సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో వైద్యులు సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను బయటకు తీశారు. మహిళా సేవల విభాగంలో 35 ఏళ్లకు పైగా పనిచేస్తున్నా. పుట్టిన తేదీ, పుట్టిన సమయం, బరువు ఇలా అన్ని నంబర్లూ ఒకే విధంగా ఉండటం నేనెన్నడూ చూడలేదని రేచల్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: