రెడ్ వైన్,వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది.ఈ రెడ్ వైన్ వివిధ జాతుల నల్ల ద్రాక్ష పండ్ల నుండి తయారుచేస్తారు.ఇక ఇది సహజసిద్దంగా తయారుచేయబడినది కాబట్టి ఎవరైన వారానికి ఒకసారి ఒక గ్లాసు రెడ్ వైన్ తీసుకుంటే,అది మీ లైంగిక కోరికలను పెంచుతుందని ఇటీవలి అధ్యాయనాలు కనుగొన్నట్లు పేర్కొన్నాయి.ఒక గ్లాస్ రెడ్ వైన్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో వ్యతిరేఖంగా పోరాడటానికి మరియు సెక్స్ పవర్ ను పెంచడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను అందిస్తుందట.ఈ విషయాన్ని 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 800 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో రెడ్ వైన్ లోని పదార్థాలు శృంగారాన్ని మరింత ప్రేరిపించినట్లు కనుగొన్నారట.ఈ అధ్యయనం గురించి జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించబడింది.ఏదేమైనా,రెడ్ వైన్ క్రమం తప్పకుండా సేవించడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయా లేదా అని నిర్థారణకు రావడంలో పరిశోధనలు కొంత విఫలమయ్యాయట,కానీ గణాంకాలు మాత్రం దీనికి సాక్షాలుగా నిలిచాయని చెబుతున్నారు.



అంతేకాకుండా రెడ్ వైన్ లోని కొన్ని పదార్థాలు శరీర అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా.ఇది స్త్రీ, పురుషులలో లైంగిక ఆసక్తినిపెంచుతుందని కనుగొనబడిందట.ఇక రెడ్ వైన్ యొక్క ప్రయోజనాలు లైంగిక కోరికను పెంచడానికే కాదట,అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అవేంటంటే గుండె మరియు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తపోటు రాకుండా సురక్షితంగా ఉంచుతుంది.రెడ్ వైన్ లో ఉండే కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది.ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా మెదడును మరింత శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది.



చాలా మంది ఆరోగ్య నిపుణులు తమ లైంగిక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి కేవలం రెండు మోతాదుల రెడ్ వైన్ సిఫార్సు చేస్తారట.ఇక ఈ రెడ్ వైన్ పురుషుల్లో కూడా మితంగా తీసుకునే వారిలో లైంగిక కోరికను ఎక్కువగా కలిగిస్తున్నట్లు ఇటీవల కనుగొనబడిందట.ఎందుకంటే దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలోని అనేక భాగాల పనితీరును లేదా చర్యలను ప్రేరేపిస్తుంది.అందులో ముఖ్యంగా మెదడు మరియు రక్త నాళాలలో రెస్వెరాట్రాల్ అనే పదార్థం వల్ల రెడ్ వైన్ లో లైంగిక కోరికను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.కాబట్టి రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తాగండి.భాగస్వామితో రోజు ఆనందంలో తేలిపోతూ లైంగిక జీవితాన్ని ఆస్వాదించండి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: