విలువైన పోషకాలున్న పప్పుధాన్యాల్లో శనగలు ముఖ్యమైనవి. శనగల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్షకాలికంగా.. ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. బాదంతో స‌మాన‌  పోష‌కాలున్న శనగలని నానబెట్టి తిన్నా, ఉడికించి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. శనగల్లో మెగ్నీషియం, థయామిన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు పీచు, ఫైథో నూట్రియంట్స్ కలిగి ఉన్నాయి. పోషకాల పరంగా విలువైన శనగలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొంటే చక్కని ఆరోగ్యం ల‌భిస్తుంద‌ని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.


వంద గ్రాముల శనగలలో 61.2 శాతం పిండిపదార్ధాలు,  190 మిల్లీగ్రాముల కాల్షియం, 5.3 శాతం కొవ్వు, 17.1 శాతం మాంసకృత్తులు, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 శాతం ఇనుము, 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా.పొటాషియం, 3.9 మి.గ్రా పీచుపదార్ధం, 361 కేలరీలు ఉంటాయి. శనగల వినియోగం శరీరపు రోగనిరోధక శక్తిని పెంచి పలు రోగాలు రాకుండా చేస్తుంది. శనగల మొలకల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.


మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే రక్తంలో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపులో ఉంచటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. శనగల్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు దూరంగా ఉండ‌వ‌చ్చు. నిద్రలేమి, ప‌చ్చ కామెర్లు, చర్మ సమస్యలకు శనగల వినియోగం మేలు చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: