మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే..

1. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి-,1. బి.పి.2. షుగరు

2. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.1. ఉప్పు2. చక్కెర3. డైరీ తయారీలు4. పిండిపదార్థాలు

3. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.1. ఆకుకూరలు2. కూరగాయలు3. పండ్లు4. గింజలు


4. ఈ మూడింటిని మరచిపొండి.1. మీ వయస్సు2. గడిచిపోయిన రోజులు3. కోపతాపాలు

5. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.1. ప్రాణ ‌స్నేహితులు2. ప్రేమించే కుటుంబం3. ఉన్నతమైన ఆలోచనలు

6. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.1. నియమిత ఉపవాసం2. నవ్వడం3. వ్యాయామం4. బరువు తగ్గుట


7. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.

2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.


మరింత సమాచారం తెలుసుకోండి: