క్యాప్సికంను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. క్యాప్సికంలో అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. వీటిని స్వీట్ పెప్పర్, బెల్ పెప్పర్‌లు అని కూడా పిలుస్తారు. వీటిల్లో పీచు, యాంటి ఆక్సిడెంట్స్ బోలెడెన్ని ఉన్నాయి.  దీనిని ఒక కూరాయగానే కాకుండా ఇతర వంటకాలలో మంచి సువాసనను చేకూర్చడానికి కూడా వినియోగిస్తారు. ఇక వైద్య రంగంలో కూడా దీని ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఎర్రటి క్యాప్సికంలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ గుణాలు అధికంగా ఉంటాయి.


వీటివల్ల కంటి సమస్యలు తొలగడమే కాకుండా వృద్ధాప్యంలో చూపుమందగించడం వంటి సమస్యలు తప్పుతాయట. దీనిని రోజూ తీసుకోవడం వలన సైనస్, జలుబు మరియు గొంతు నొప్పులకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిలోని వివిధ గుణాలు అధిక బరువు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అధిక తలపోటు మరియు కీళ్ల నొప్పులకు వినియోగించే వివిధ ఔషధాలలో క్యాప్సికం వాడకం అధికంగా ఉంటుంది. థెర్మొజెనెసిస్ ద్వారా క్యాప్సికమ్ జీవక్రియ ప్రక్రియను పెంచుతాయి. కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది.


అదే విధంగా గుండె, క్యాన్సర్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. దీనిని సరైన మోతాదులో తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. కొంతమంది ఆరోగ్య సంరక్షకుల ప్రకారం క్యాప్సికంను అధికంగా తీసుకోవడం వలన చర్మ రోగాలు, అలర్జీ సమస్యలు, కంటి మరియు ముక్కుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అయితే మితంగా తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: